Begin typing your search above and press return to search.

అనుష్కతో తిట్లుతిన్నోడు మామూలోడు కాదు

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:35 AM GMT
అనుష్కతో తిట్లుతిన్నోడు మామూలోడు కాదు
X
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఈమధ్య చేసిన ఓ పనితో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అనుష్క తన భర్త - క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి వెళ్తుండగా రోడ్డుపై ప్లాస్టిక్ వేస్ట్ పడేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని చెడామడా దులిపి పడేసింది. రోడ్డుపై క్లీన్ నెస్ పాటించాల్సిన అవసరం లేదా అంటూ అవతల వ్యక్తిని గుక్కతిప్పుకోనీయకుండా తిట్టిపడేసింది. ఈ వీడియోను స్వయంగా విరాట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అనుష్క చేసిన పని సూపర్ అంటూ కొందరు నెటిజన్లు ఆమెను తెగ పొగిడారు. ఇంకొందరేమో ఇదో పబ్లిసిటీ స్టంట్ అని.. అనుష్క కావాలనే అలా బిహేవ్ చేసిందంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్లు పెట్టారు. అనుష్కతో తిట్లు తిన్న సామాన్యుడిపై కాస్తంత జాలి చూపించారు. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చినదేమిటంటే అనుష్కతో తిట్లు తిన్న సదరు వ్యక్తి పేరు అర్హన్ సింగ్. ఇతడు తన తప్పును ఒప్పుకొంటూనే అనుష్క కాస్త పొలైట్ గా ఈ విషయం చెప్పుంటే ఆమె స్టార్ ఇమేజ్ కేమీ భంగం రాదు కదా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో చురక అంటించాడు. అర్హన్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూసిన వారికి అతడికి బాలీవుడ్ తో మంచి రిలేషన్ ఉందన్న విషయం గుర్తించారు. కాకుంటే ఇప్పుడు కాదు.. చిన్నప్పుడు. 90లలో అతడు బాలనటుడుగా చాలా ఫేమస్. బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ తో కలిసి కూడా ఓ సినిమాలో నటించాడు.

90లలో షారూఖ్ హీరోగా నటించిన ఇంగ్లిష్ బాబు దేశీ మామ్ తోపాటు మాధురి దీక్షిత్ హీరోయిన్ గా నటించిన రాజా సినిమాలోనూ నటించాడు. అప్పట్లో తెగ పాపులరయిన దేఖ్ బాబూ దేఖ్ అనే టీవీసిరీస్ లోనూ చేశాడు. చివరగా షాహిద్ కపూర్ తో కలిసి పాఠ్ శాలలలో నటించాడు. అప్పట్లో సన్నీ సింగ్ గా ఈ అర్హన్ బాగా ఫేమస్ అయ్యాడు. ఇదిగో ఇలా ఇన్నాళ్లకు మళ్లీ అనుష్క పుణ్యమా తిరిగి వెలుగులోకి వచ్చాడు.