Begin typing your search above and press return to search.

పెళ్ళికి భాజాలు మోగే టైమొచ్చింది...

By:  Tupaki Desk   |   26 Aug 2015 8:28 AM GMT
పెళ్ళికి భాజాలు మోగే టైమొచ్చింది...
X
స్వీటీ అనుష్క టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో హాట్‌ ప్రాపర్టీ. అనుష్క తెరపై కనిపిస్తే చాలు కాసుల గలగలలే. కేవలం గ్లామర్‌ డాళ్‌ అన్న స్థాయి నుంచి అసాధారణంగా తనకోసమే దర్శకరచయితలు కథలు రాసుకునే స్తాయికి ఎదిగింది. ఇది అంత తేలిగ్గా వచ్చినదేం కాదు. నిరంతర కృషితో, పట్టుదలతో సాధించుకున్నది. అనుష్క కెరీర్‌ ఇప్పుడు పీక్స్‌ లో ఉంది.

బాహుబలితో 600కోట్ల క్లబ్‌ సినిమాలో నటించిన నాయికగా పాపులర్‌ అయ్యింది. ఇక అక్టోబర్‌ లో బాహుబలి 2లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈలోగానే ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించిన సైజ్‌ జీరో తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే కెరీర్‌ సంగతి సరే. వయసు మూడు పదులు దాటింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ప్రతిసారీ అనుష్క సమాధానం ఒక్కటే. నాకు తగ్గ వరుడు దొరికే వరకూ వేచి చూడాల్సిందే. నావాడు వచ్చే వరకూ వేచి చూస్తా .. అంటూ రొటీన్‌ సినిమాటిక్‌ డైలాగుల్నే వల్లించింది.

నావాడు ఎప్పుడొస్తాడు? అన్నది ప్రతిసారీ జర్నలిస్టులు అడగడం స్వీటీ సింపుల్‌ గా నవ్వేస్తూ.. వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే అనడం షరా మామూలే అయిపోయింది. ఇంట్లోవాళ్లు ఓవైపు సంబంధాలు వెతుకుతున్నా.. స్వీటీ మనసులో ఇంకేదో దాగి ఉంది. ఒకవేళ పెళ్లి పేరుతో కోట్లాది రూపాయల డీల్స్‌ వదులుకోవడం కష్టం అని భావిస్తోందా? ఏమో! పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ ని సాగిస్తున్న జ్యోతిక, జెనీలియా, శ్రీదేవి వీళ్లంతా తనకి ఆదర్శం అనుకోవట్లేదు ఎందుకో?