Begin typing your search above and press return to search.

బొమ్మాళిని ఈయనెలా చూపిస్తాడో..

By:  Tupaki Desk   |   23 March 2018 7:08 PM GMT
బొమ్మాళిని ఈయనెలా చూపిస్తాడో..
X
టాలీవుడ్ స్వీటీ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల దిట్ట. ప్రత్యేకించి ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు ప్రాణం పోసేస్తుంది. దర్శకులు కోరుకున్నట్లుగా ఆయా పాత్రల్లోకి ఒదిగిపోవడంలో అనుష్క శెట్టి తర్వాతే ఏ హీరోయిన్ అయినా ఉంటుంది.

అనుష్కను కోడి రామకృష్ణ అరుంధతిగా చూపిస్తే.. దేవసేనగా రాజమౌళికి చూపించాడు. రీసెంట్ గా భాగమతిగా ఆమెతో డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాడు అశోక్. ఇలా కొత్త తరహా కథాంశాలకు తన నటనతో ప్రాణం పోసేస్తుంది అనుష్క. కొన్నేళ్ల క్రితం వరకూ గ్లామర్ రోల్స్ కూడా చేసింది కానీ.. ఇప్పుడు వీటికి దూరం దూరం అంటోందీమె. ఇందుకు ఫిజిక్ పెరిగిపోవడం కూడా ఓ కారణం అయినా.. ఆమె స్థాయి పెరగడం అన్నది అసలు రీజన్. అందుకే బాహుబలి2 తర్వాత ఇప్పటి వరకూ కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు. భాగమతి మూవీ కూడా బాహుబలి ముగింపు కంటే ముందే మొదలైన సినిమానే.

అయితే.. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో అనుష్క ఓ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఆమె సన్నిహితులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు కానీ.. అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ఇది కూడా అనుష్క కెరీర్ లో గొప్పగా నిలిచిపోయే పాత్ర అని అంటున్నారు. ఇంతమంది దర్శకులు ఇప్పటివరకూ స్వీటీలోని రకరకాల యాంగిల్స్ ను బయటకు తీశారు. ఇప్పుడు ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ మీనన్.. మన బొమ్మాళికి ఎలాంటి ఆఫర్ చేశాడో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.