Begin typing your search above and press return to search.

ఇలా అయితే క‌ష్టం నానా స్వీటీ

By:  Tupaki Desk   |   29 Nov 2015 6:11 AM GMT
ఇలా అయితే క‌ష్టం నానా స్వీటీ
X
స్వీటీ అనుష్క శెట్టి మంచిత‌నం గురించి ప‌రిశ్ర‌మ‌లో అంతా చెబుతుంటారు. త‌నో పెద్ద స్టార్ అన్న స్టాట‌స్‌ చూపించ‌కుండా అంద‌రితో క‌లిసిపోతుంది. మంచి మ‌న‌సుతో ఆప్యాయంగా అంద‌రితో మాట్లాడే స్వ‌భావం ఉన్న నాయిక‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఇదే మంచి మ‌న‌సు స్వీటీని పూర్తిగా చిక్కుల్లో ప‌డేసింద‌ని చెబుతున్నారు. మొహ‌మాటానికి పోయి నిర్మాతల‌ కోసం ఉచితంగా సినిమాలు చేస్తూ త‌న విలువైన స‌మ‌యాన్ని వృథా చేసుకుంటోందిట పాపం.

స్వీటీ ఇంత‌కుముందే పివిపి సినిమాస్ కి ఓ సినిమా చేసింది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వ‌ర్ణ చిత్రంలో ఆర్య స‌ర‌స‌న న‌టించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో పివిపికి భారీగా న‌ష్టాలొచ్చాయి. అయితే మంచి మ‌న‌సుతో స్వీటీ మ‌రో సినిమా ఉచితంగా చేస్తానంటూ పీవీపీకి మాటిచ్చింది. ఆ మాట నిలబెట్టుకుంటూ చేసిన సినిమానే సైజ్ జీరో. ప్ర‌స్తుతం అనుష్క న‌టించిన సైజ్ జీరో థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. ఏమాత్రం క‌మ‌ర్షియ‌ల్ కంటెంట్ లేని మూవీగా డివైడ్ టాక్ వ‌చ్చింది.

ఇది మ‌ల్టీప్లెక్స్ మూవీ మాత్ర‌మే. మూవీ బి,సి సెంట‌ర్ల ఆడియెన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఈ చిత్రంలో స్వీటీ న‌ట‌న బావున్నా, ఫ‌లితం మాత్రం వేరేగా క‌నిపించింద‌ని అంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు. అందుకే ఇప్పుడు స్వీటీలో కొత్త బెంగ మొద‌లైంది. మ‌రోసారి మొహ‌మాటానికి పోయి పివిపికి ఉచిత ఆఫ‌ర్ ఇవ్వాల్సొస్తుందేమోన‌ని.