Begin typing your search above and press return to search.

బాహుబలి2లో బోలెడు గ్లామర్ -అనుష్క

By:  Tupaki Desk   |   4 Oct 2015 9:30 AM GMT
బాహుబలి2లో బోలెడు గ్లామర్ -అనుష్క
X
యాభై కోట్ల కు మించిన బడ్జెత్ సినిమా నిర్మించడమంటేనే సవాల్. అలాంటిది ఓ హీరోయిన్ ని నమ్మేసి అంతేసి సొమ్ములు పోయాలంటే.. అంత స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కావాలి. ఇంత భారీ సినిమాలంటే.. హీరోయిన్ గా అనుష్క తప్ప వేరే ఛాయిస్ లేదంటే.. స్వీటీ స్థాయి ఏంటో అర్ధమవుతుంది. వర్ణ - బాహుబలి - రుద్రమదేవి అలా.. అన్ని భారీ మూవీల్లోనూ అనుష్క ఒకటే ఆప్షన్

మరో నాలుగు రోజుల్లో అనుష్క రుద్రమదేవి రిలీజ్ అవుతోంది. కంప్లీట్ అవడానికి చాలా టైం పట్టిందని.. అయితే.. రెండున్నరేళ్లు పట్టినా ఇలాంటి సినిమాలు చేయడం అదృష్టంగా చెబ్తోంది అనుష్క. రిటైర్ అయ్యేనాటికి మనమేం చేశాం అని వెనక్కి తిరిగి చూసుకుంటే... చెప్పుకోవడానికి కెరీర్ లో రెండు, మూడూ పాత్రలుండాలిగా అంటోంది అనుష్క. రుద్రమ కోసం కత్తియుద్ధాలు - గుర్రపుస్వారీ నేర్చుకుందిట. రిహార్సల్స్ లోనే చాలా దెబ్బలు తగిలినా.. పట్టుదలతో అన్నీ కంప్లీట్ చేశానంటోంది.

తన కెరీర్ ఈ స్థాయికి చేరడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుందిట అనుష్కకి. సూపర్ సినిమా సమయంలో నాగార్జున నాకోసం తీసుకున్న జాగ్రత్తలు ఎప్పటికీ మర్చిపోలేనంటోంది. ప్రతీ సినిమాని సవాల్ గానే తీసుకుంటానని చెబ్తోంది. ఎక్కడికెళ్లినా జేజమ్మ - స్వీటీ అని పిలుస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది. కానీ.. కొంతమంది మొహం మీద ఫోన్ పెట్టి ఫోటోలు తీస్తుంటే.. ఫోన్ లాక్కుని పగలకొట్టాలన్నంత కోపం వచ్చేస్తుందిట. అయినా కష్టపడి ఆ కోపం ఆపుకుంటానని చెబ్తోంది.

బాహుబలి డీగ్లామర్, రుద్రమ లాంటి కేరక్టర్ల కారణంగా అందానికి దూరమవుతున్నారా అంటే మాత్రం అలాంటిందేం లేదు.. బాహుబలి 2లో బోలెడు గ్లామర్ ఉంది చూద్దురుగానిలే అంటూ.. ముసిముసి నవ్వులు చిందిస్తోంది స్వీటీ.