Begin typing your search above and press return to search.

మరోసారి బాహుబలి-దేవసేన జోడీ

By:  Tupaki Desk   |   14 Dec 2018 5:18 PM GMT
మరోసారి బాహుబలి-దేవసేన జోడీ
X
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించే సినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేదు. 'బాహుబలి' కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ 'సాహో' షూటింగ్ తో బిజీ అయ్యాడు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ ఇక వచ్చే ఏడాది ఆగస్ట్ లో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కాకమునుపే ప్రభాస్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా గురించి తాజా గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందనే విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో మరో కీలకమైన హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నారట. ప్రభాస్ - అనుష్క ల మధ్య ఇది వన్ సైడ్ లవ్ స్టొరీలా సాగుతుందట. ఇద్దరి మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. టాలీవుడ్ లోని బెస్ట్ ఆన్ స్క్రీన్ జంటలలో ప్రభాస్-అనుష్కలు ముందువరుసలో ఉంటారు. ఇక ఇద్దరిమీద వచ్చే పెళ్ళి రూమర్లు విని విని అందరూ అలిసిపోయారు. వీటితో సంబంధం లేకుండా మరోసారి ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ పై జోడీగా కనిపించడం విశేషమే.

ఇప్పటికే 'మిర్చి'.. 'బిల్లా'.. 'బాహుబలి' సినిమాల్లో నటించిన ఈ జోడీ మరోసారి కలిసి నటించడం తప్పకుండా ఫ్యాన్స్ ను మురిపించే విషయమే. ప్రభాస్-అనుష్కల మధ్య జరిగే ఎపిసోడ్ ఈ సినిమాలో ఒక హైలైట్ లా ఉంటుందట.