Begin typing your search above and press return to search.

అనుష్క ఒంటరిగా ఏడ్చింది ఎందుకంటే..

By:  Tupaki Desk   |   27 July 2016 9:41 AM GMT
అనుష్క ఒంటరిగా ఏడ్చింది ఎందుకంటే..
X
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి సంగతి పక్కనపెడితే.. ఈ మధ్యకాలంలో పట్టుమని ఐదేళ్లు హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడం అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి. అలాంటిది పదేళ్లపాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదుగుతూ.. హీరోల స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ అనుష్క అని చెప్పడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. కెరీర్ మొదలైనప్పటినుంచీ నేటివరకు కెరీర్ పీక్స్ లోనే కొనసాగడం మరో గొప్ప విషయం. ఈ విషయంలో నాగార్జున పాత్ర కూడా కీలకం అనేది అనుష్క గర్వంగా చెప్పుకునే విషయం. బెంగళూరులో ఉన్న యోగా టీచర్ ని సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఇలా తన పదేళ్ల కెరీర్, ఈ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు - గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది అనుష్క!!

ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే - మరో పక్క టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో ప్రేమ పాత్రలు చేయడం అనుష్కకే చెల్లింది. అయితే.. సినిమా రంగం అయినంత మాత్రాన విలాసవంతమైన జీవితం ఉండదని, ఈ జీవితంలో ఎన్నో బాదలు పడాల్సి ఉంటుందనీ, నటులకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయని చెప్పడం మొదలుపెట్టిన అనుష్క.. తన కెరీర్ లో పడిన కష్టాలను ఒక్కొక్కటిగా వివరించింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పుడు మేకప్ కోసం ఎంతో అనుష్క ఎంతో కష్టపడేదట. ఆ ప్రత్యేక పాత్రల కోసం గంటలు తరబడి మేకప్ వేయించుకోవాల్సి రావడం, ప్రాక్టీస్ చేయాల్సి రావడం సాదారణమైన విషయాలు కాదని చెబుతుంది అనుష్క. షూటింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్తే ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉండటం.. ఆ విషయాన్ని ఇంట్లో వారికి చెబితే బాధపడతారని.. ఆ బాధ తట్టుకోలేక రూం లో ఒక్కత్తే కూర్చుని ఏడ్వటం అనుష్కకు నిత్యకృత్యమట.

ఇదే సమయంలో సైజ్ జీరో కోసం పడ్డ కష్టం ప్రత్యేకమైందని చెబుతుంది అనుష్క. ఫ్యాటీగా అవ్వడం వెంటనే సన్నగా అవ్వడం అనేవి ఆరోగ్యంతో ఆడుకోవడమని తెలిసినా కూడా ఎంతోకష్టపడి రిస్క్ చేసి ఆ పాత్రలు చేసిందట. ఇన్ని చేసిన, చూసిన అనుష్క... రిస్క్ చేయకుండా - తీవ్రంగా కష్టపడకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కుదరదని సూటిగా చెబుతుంది. ఈ రోజు వచ్చిన హోదా - గుర్తింపు వెనక ఇలా ఎన్నో ఒంటరి కన్నీటి రోజులు ఉన్నాయట అనుష్క జీవితంలో! అనుష్క అందగత్తే కాదు.. ఆదర్శప్రాయురాలు కూడా కదా!!