Begin typing your search above and press return to search.

‘మహానటి’లో ‘భాగమతి’?

By:  Tupaki Desk   |   18 Feb 2018 7:27 AM GMT
‘మహానటి’లో ‘భాగమతి’?
X
వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహానటి’. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్.. సమంత.. విజయ్ దేవరకొండ.. దుల్కర్ సల్మాన్.. మోహన్ బాబు.. ప్రకాష్ రాజ్.. షాలిని పాండే లాంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. ఈ తారాగణానికి మరో ఆసక్తికర పేరు తోడవుతున్నట్లు సమాచారం.

ఇటీవలే ‘భాగమతి’గా ప్రేక్షకుల్ని అలరించిన అనుష్క ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆమె సావిత్రి తరంలోని మరో మహానటి భానుమతిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా హుందాగా.. ఆత్మవిశ్వాసంతో కనిపించే భానుమతి పాత్రకు అనుష్క అయితేనే పర్ఫెక్ట్ అని ఫీలయ్యిందట చిత్ర బృందం. అనుష్క కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించిందట. మరి ఈ సమాచారం ఎంత వరకు వాస్తవమో చూడాలి.

‘మహానటి’లో మోహన్ బాబు ఎస్వీ రంగారావు పాత్రలో.. ప్రకాష్ రాజ్ బి.నాగిరెడ్డి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్-ఏఎన్నార్ పాత్రల విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. ఎన్టీఆర్ పాత్రకు తారక్ ను అడిగితే అతను నో చెప్పినట్లు వార్తలొచ్చాయి. అతను ఓకే అంటే ఏఎన్నార్ పాత్ర చేయడానికి నాగచైతన్య రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమాకు మామూలు క్రేజ్ రాదు. కానీ అతను సుముఖంగా లేడంటున్నారు. మరి ఈ పాత్ర ఇంకెవరితో చేయిస్తారో చూడాలి. ‘మహానటి’ని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్.