Begin typing your search above and press return to search.

అనుష్క బదులు సమంత కాదు

By:  Tupaki Desk   |   9 Feb 2016 9:30 AM GMT
అనుష్క బదులు సమంత కాదు
X
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే అనుష్కే గుర్తుకొస్తుంది. అరుంధతి - రుద్రమదేవి లాంటి సినిమాలతో హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించుకుంది అనుష్క. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలనుకుంటే ముందు ఆయన కళ్లకు అనుష్కే కనిపించింది. ‘రుద్రాక్ష’ పేరుతో ఆయన తీయాలనుకున్న సినిమాకు అనుష్కనే ఎంచుకున్నాడు. ఐతే ఈ మధ్య అనుష్కను తప్పించేశారని.. ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఐతే అందులో వాస్తవం లేదు. అనుష్కను తప్పించడం లాంటిదేమీ లేదు.

ఈ సినిమాలో సమంత నటిస్తున్న మాట వాస్తవమే కానీ.. అనుష్కను తప్పించలేదు. అనుష్క - సమంత ఇద్దరూ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. అంతే కాదు.. రమ్యకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్రకు ఎంచుకున్నారు. ఆమెది దయ్యం పాత్ర అని కూడా అంటున్నారు. మొత్తానికి ముగ్గురు ప్రముఖ కథానాయికలతో ఇది ఒక మల్టీస్టారర్ మూవీలా మారింది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోలు కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఆ ఐదుగురు హీరోలు ఎవరో కానీ.. ఇది భారీ ప్రాజెక్టే అయ్యేలా కనిపిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ మొదలు కానుంది.