Begin typing your search above and press return to search.

అశిన్ ల‌వ్‌స్టోరీని పొగిడేసిన అనుష్క‌

By:  Tupaki Desk   |   6 Oct 2015 1:30 AM GMT
అశిన్ ల‌వ్‌స్టోరీని పొగిడేసిన అనుష్క‌
X
పెళ్లి గురించి హీరోయిన్ల‌ను ప్ర‌శ్నించ‌డం పెద్ద టైమ్ వేస్ట్‌. ఎప్ప‌ట్లానే స్టీరియో టైపిక్ ఆన్స‌ర్ త‌ప్ప వేరే కొత్త‌గా ఏమీ చెప్ప‌రు. అనుష్క విష‌యం లో ఇలాంటివి చాలా సార్లు జ‌రిగాయి. అందుకే ఓ జ‌ర్న‌లిస్టు రొటీన్‌ గా ఎందుకు అనుకున్నాడో ఏమో.. కాస్త క్రియేటివ్‌ గా పెళ్లి గురించి అడిగేస్తే ఏమ‌ని స‌మాధానం చెప్పిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్‌. ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్‌.. మీరు కూడా చ‌ద‌వండి మ‌రి...

ఈరోజుల్లో అమ్మాయిలం తా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. డ‌బ్బున్న‌వాడినే పెళ్లాడుతున్నారు. కెరీర్‌, లైఫ్ విష‌యంలో తెలివైన ఆట ఆడుతున్నారు. మీరు కూడా అలా ప్లాన్ చేసుకోలేదా? అశిన్ మైక్రోమ్యాక్స్ ఓన‌ర్‌ని పెళ్లి చేసుకుంటోంది. తెలివైన ప్లానింగ్ అది. అలా మీరు కూడా చేయ‌ట్లేదా? .. అని అనుష్క‌ను సూటిగా అడిగితే ఏం స‌మాధానం చెప్పి ఉంటుంది? ఊహించ‌గ‌ల‌రా? ఊహ‌కంద‌ని రిప్ల‌య్ అట్నుంచి వ‌చ్చింది. చాలా మెచ్యూర్డ్ ఆన్స‌ర్ వినిపించింది. ఆ స‌మయంలో అనుష్క మ‌న‌సులో బోలెడ‌న్ని ఉద్వేగాలు, క‌ళ్ల‌లో మెరుపులు, మిరుమిట్లు..

అనుష్క ఏమంటోందంటే... ''పెళ్లి అనేది ప్లాన్ చేస్తే జ‌ర‌గ‌దు. అది డెస్టినీ. రాసి పెట్టి ఉంటేనే జ‌రుగుతుంది. అమ్మాయిలు పెళ్లిని బిజినెస్ చేశారు అంటే న‌మ్మ‌ను. అసిన్ ప్రేమాయ‌ణం చాలా వెరైటీగా జ‌రిగింది. ముందుగా అక్ష‌య్‌కుమార్ మైక్రోమ్యాక్స్ అధినేత‌ని ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత ఆ ప‌రిచ‌యం స్నేహంగా మారి ప్రేమ‌, పెళ్లి వ‌ర‌కూ వెళుతోంది. నా జీవితంలో కూడా రైట్ ప‌ర్స‌న్ రావాలి. స‌రైన స‌మ‌యం రావాలి. అప్పుడే పెళ్లి అనేది జ‌రుగుతుంది. పెళ్లి ప్లాన్ చేస్తే జ‌రిగేది కాదు. అమ్మాయి అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే'' అంటూ స్వీటీ తెలివైన స‌మాధానం చెప్పింది. ఈ ఆన్స‌ర్‌లో అసిన్‌ని డిపెండ్ చేసిన తీరు, త‌న పెళ్లి గురించి దాట వేసిన వైనం .. ఇంప్రెస్సివ్ అన‌కుండా ఉండ‌గ‌ల‌మా?