Begin typing your search above and press return to search.

ప్రభాస్ ప్రొడక్షన్ కి సై అంటున్న స్వీటీ

By:  Tupaki Desk   |   1 Dec 2015 10:30 PM GMT
ప్రభాస్ ప్రొడక్షన్ కి సై అంటున్న స్వీటీ
X
ఎన్నో ఆశలు పెట్టుకున్న సైజ్ జీరో.. రిజల్ట్ తేడా కొట్టడంతో కొంచెం నిరుత్సాహపడ్డ అనుష్క.. ఇప్పుడు బాహుబలి 2కి రెడీ అయిపోతోంది. అదే సమయంలో కోలీవుడ్ లో సింగం 3 కేకలకు సిద్ధమవుతోంది. ఒకే సారి రెండు భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేయడం కష్టమే కానీ.. అనుష్కకి ఇది కామనే. సింగిల్ గానే నడిపించేయగల సత్తా ఉన్న అనుష్కకి.. ఇదేమంత పెద్ద విషయం కాదు.

అయితే.. ఇప్పుడు ప్రభాస్ బ్యానర్ లో నటించేయడానికి స్వీటీ సై అంటోందని తెలుస్తోంది. అఫ్ కోర్స్.. ప్రభాస్ బ్యానర్ అంటే.. తనేం సొంత బ్యానర్ స్టార్ట్ చేయలేదు కానీ.. తన హోం బ్యానర్ లా అనిపిస్తుంది అని రెబెల్ స్టార్ చెప్పిన యూవీ క్రియేషన్స్ పై అన్నమాట. ప్రమోద్ - వంశీలు నిర్మించే ఓ ప్రాజెక్ట్ కు స్వీటీ శెట్టి ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పగా.. తనకు బాగా నచ్చిందని చెప్పిందని అంటున్నారు. రెమ్యూనరేషన్, డేట్స్ లాంటి మిగిలిన టాక్స్ నడుస్తున్నాయట.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇందులో హీరో ఎవరు అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవేళ హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కావచ్చని, అందుకే ముందు హీరోయిన్ ని డిసైడ్ చేశారనే టాక్ కూడా నటిస్తోంది. మరి ప్రభాస్ కూడా తన కజిన్స్ నిర్మించబోయే చిత్రంలో అనుష్కతో కలిసి చేస్తాడా అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే.. ఇప్పటికైతే ఇవన్నీ ప్రశ్నలే. ఆన్సర్ అడుగుదామంటే.. బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మరి అనుష్క డీటైల్స్ ఎప్పుడు చెబ్తుందో ?