Begin typing your search above and press return to search.

సాహో సెట్ లో దేవసేన సందడి

By:  Tupaki Desk   |   13 Jan 2018 5:31 AM GMT
సాహో సెట్ లో దేవసేన సందడి
X
బాహుబలి స్టార్ ప్రభాస్ కత్తి పట్టిన తరువాత ఇప్పుడు గన్నులు పడుతున్నాడు. కొండలపై జలపాతాలపై సాహసాలు, గుర్రాలపై స్వారీలు చేసిన రెబల్ స్టార్ ఇప్పుడు బిల్డింగ్ లపై నుంచి దూకుతూ స్టైలిష్ బైక్ లపై ఫీట్లు చేస్తున్నాడు. మొత్తానికి ఒక రాజులా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు సూపర్ హీరోగా కనిపించడానికి రెడీ అయ్యాడు. సాహో సినిమాతో తన అసలైన బాక్స్ ఆఫీస్ రేంజ్ ను చూపించాలని తెగ కష్టపడుతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబందించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక ఫొటో అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అందులో బాహుబలి ప్రేయసి దేవసేన అనుష్క వచ్చింది. బాహుబలి సినిమాలో అనుష్క - ప్రభాస్ జోడి ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే రీసెంట్ గా సాహో షూటింగ్ చూడాలని అమ్మడు సెట్ లోకి వచ్చింది. చాలా సేపటివరకు అక్కడే ఉంది. ఇక షూటింగ్ అనంతరం దర్శకుడితో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగింది. వారితో పాటు యాక్టర్ మురళీ శర్మ.. కెమెరామ్యాన్ మది కూడా ఉన్నారు. ఆ సెల్ఫీ పిక్ ప్రస్తుతం జనాలను చాలా ఆకట్టుకుంటోంది. ఇకపోతే అనుష్క మొత్తానికి తన భాగమతిని పూర్తి చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఆ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది.