Begin typing your search above and press return to search.

నా బదులు నయనతార ఓకే- అనుష్క

By:  Tupaki Desk   |   4 Oct 2015 10:30 PM GMT
నా బదులు నయనతార ఓకే- అనుష్క
X
ఓ స్టార్ హీరోయిన్ ఇంకో స్టార్ హీరోయిన్ కు కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఇష్టపడదు. అసలు వేరే హీరోయిన్ల ఊసెత్తడానికే తటపటాయిస్తారు చాలామంది హీరోయిన్లు. అలాంటిది ఫలానా పాత్ర మీరు కాకుండా ఇంకొకరు చేయాల్సి వస్తే ఎవరిని సజెస్ట్ చేస్తారు.. అని అడిగితే సమాధానం ఇచ్చేవాళ్లు ఎంతమంది ఉంటారు. ఈ ప్రశ్నకు చాలామంది ఏమో చెప్పలేం అనే సమాధానమిస్తారు. కానీ అనుష్క మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. రుద్రమదేవి- దేవసేన లాంటి పాత్రలకు మీరు కాకుండా ఎవరు సూటవుతారు అని అనుష్కను అడిగితే.. ‘‘ఇప్పటి హీరోయిన్లలో ఇలాంటి రాజసం ఉట్టిపడే పాత్రలకు నయనతార బాగా సూటవుతుంది’’ అని బదులిచ్చింది అనుష్క.

‘రుద్రమదేవి’కి సీక్వెల్ గా ‘ప్రతాపరుద్రుడు’ తీయబోతున్నారటగా అని అడిగితే.. ఏమో ఆ సంగతి నాకు తెలియదు, గుణశేఖర్ కు అలాంటి ఆలోచన ఉంటే తప్పకుండా చేస్తా అని సమాధానం చెప్పింది అనుష్క. మీడియాలో ప్రచారం జరిగినట్లు తనకు, గుణశేఖర్ కు ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని, రుద్రమదేవి కోసం ప్రాణం పెట్టి పని చేసిన ఆయన మీద తనకెంతో గౌరవం ఉందని అనుష్క చెప్పింది. సైజ్ జీరో సినిమాను ‘రుద్రమదేవి’కి పోటీగా తేవాలనుకున్న మాట అవాస్తవమని.. ‘రుద్రమదేవి’ రాకుంటే ఆ తేదీకి ‘సైజ్ జీరో’ను విడుదల చేయాలని మాత్రమే అనుకున్నామని.. కానీ రుద్రమదేవి అనుకున్నట్లే అక్టోబరు 9న విడుదలవుతుండటంతో సైజ్ జీరో వాయిదా వేశామని అనుష్క చెప్పింది.