స్వీటీ నిశ్శబ్దం మొదలైపోయింది

Sat May 25 2019 12:25:19 GMT+0530 (IST)

భాగమతి తర్వాత తెరమీద దర్శనం లేక అభిమానులను లాంగ్ వెయిటింగ్ లో ఉంచిన అనుష్క ఫైనల్ గా మేకప్ వేసుకుంది. ఎక్కువ హడావిడి లేకుండా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లాంగ్వేజ్ మూవీ ఈ రోజు యుఎస్ లో అఫీషియల్ గా మొదలైపోయింది. అమెరికాలో కాబట్టి మన మీడియాకు లైవ్ దొరికే ఛాన్స్ లేకపోయింది. కోన వెంకట్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యులుగా ఈ సినిమాకు తెలుగులో నిశ్శబ్దం ఇంగ్లీష్ లో సైలెన్స్ గా టైటిల్ ఫిక్స్ చేశారు.ఇదే అర్థం వచ్చే పదాలతోనే మిగిలిన బాషలకు కూడా పేర్లు డిసైడ్ చేస్తారు.  ఏడాదిన్నర పైగా గ్యాప్ తీసుకున్న స్వీటీ సైరాలో కూడా క్యామియో చేసిందన్న టాక్ వచ్చింది కానీ దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు ఇక నిశ్శబ్దంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తుండగా అంజలితో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సైలెన్స్ కథ గురించి ఏ చిన్న లీక్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది. ఇందులో సుబ్బరాజు కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తోనే రూపొందుతున్న నిశ్శబ్దం విడుదల తేది గురించి ఇంకా సమాచారం లేదు. టెక్నీకల్ టీమ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అతి త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి కొత్త అనుష్కను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో చూసుకోవచ్ఛన్న మాట