హాట్ టాపిక్: స్వీటీ పక్కన కూర్చున్నదెవరు?

Mon Feb 11 2019 22:51:09 GMT+0530 (IST)

అనుష్క స్లిమ్ముగా మారిందనే న్యూస్ ఇప్పటికే వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది.. అదేలెండి సామాజిక మాధ్యమాల్లో దావానలంలాగా వ్యాపించింది.  ఇక ఆ టాపిక్ గురించి కొత్తగా మాట్లాడేందుకు ఏమీ మిగల్లేదు. మరి మనం ఇప్పుడు దేనిగురించి మాట్లాడుకోవాలి?  అనుష్క స్లిమ్ముగా ఉన్న సింగిల్ ఫోటోతో పాటుగా అదే డ్రెస్ లో అదే లొకేషన్ లో మరో వ్యక్తితో పాటు కలిసి పోజిచ్చిన ఫోటో కూడా సామాజిక మాధ్యమాల్లో.. అంతర్జాలంలో ఆరాచకం సృష్టించింది.అరాచకం అనేది పెద్ద పదమేమో గానీ జనాలు ఆ ఫోటోకు స్పందించిన తీరు చూస్తే మాత్రం ఆ పదాన్ని వాడడం తప్పు కాదేమోనని.. సబబేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే లోకులు కాకులు .. ఇక అంతర్జాల లోకులు అంతర్జాతీయ కాకులు.  ఒక్క ఫోటోలో ఏదైనా కొత్త విషయం ఉంటే దాన్ని అంతు చూసేవరకూ వారు నిద్రపోరు. ఆ ఫోటోలో ఉన్న యంగ్ మ్యాన్ అనుష్క వివాహం చేసుకోబోయేవాడని కూడా కొందరు అర్థాలు తీశారు. ఇలాంటివి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ అవన్నీ అరాచకానికి సింబల్సే. 

నిజం ఏంటంటే అయన పేరు ల్యూక్ కోటినో.  అయన ఒక న్యూట్రిషనిస్ట్.  ఇంటిగ్రేటివ్ అండ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ లో ఒక స్పెషలిస్ట్.  అనుష్క అధికబరువు ని తగ్గించి అంతకు ముందు ఎలా ఉందో అలా మారడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి.  అయన పర్యవేక్షణలోనే స్వీటీ ఆస్ట్రియాకు చబ్బీగా వెళ్లి ఇండియాకు స్లిమ్ గా తిరిగొచ్చింది. అంతే. ఇంకేం లేదు.  ఒకవేళ ఉంటే గింటే త్వరలో ల్యూక్ ఇండియాలో న్యాచురల్ వెయిట్ లాస్ సెంటర్ మొదలుపెడితే స్వీటీ తనకు బ్రాండ్ అంబాజిడర్ గా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.  అంతే.  ఈ 'అంతే' కు మరోసారి కొనసాగింపు లేదు.