అనుష్కను గుర్తు పట్టడం కష్టమే!!

Sat Apr 21 2018 12:03:18 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రొఫెషనల్ గా పరుగులు పెట్టేస్తోంది. పర్సనల్ లైఫ్ లో విరాట్ కోహ్లీతో తన లవ్ ఎఫైర్ ను ఓ కొలిక్కి తెచ్చేసి పెళ్లితో క్లైమాక్స్ చూపించేసి.. కొత్త జీవితం ప్రారంభించేసిన అనుష్క శర్మ.. ఇటు వృత్తిపరంగా ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.రీసెంట్ గా వచ్చిన పారి చిత్రంలో ఆమె గెటప్.. నటనకు ఎన్ని మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు సుయి ఢాగా అనే మరో చిత్రంలో నటిస్తోంది అనుష్క శర్మ. ఈ చిత్రంలో ఈ బ్యూటీ డీ గ్లామర్ రోల్ లో కనిపించనుందని.. ముందు నుంచి సమాచారం ఉంది. కానీ అది ఎలాంటి గెటప్.. కథ ఏంటి అనే అంశాలపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఓ ఫోటో ద్వారా అనుష్క శర్మ ఎలాంటి పాత్రలో కనిపించబోతోందో తెలిసిపోయింది. సుయి ఢాగా మూవీలో ఓ వృద్ధురాలి పాత్రలో కనిపించబోతోంది అనుష్క.

ఈమె మేకప్ కు టచప్స్ వేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. వీరాభిమానుల సంగతేమో కానీ.. కామన్ పీపుల్ కు మాత్రం ఈమే అనుష్క శర్మ అని చెబితే షాక్ అవడం ఖాయం. అంతగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది అనుష్క శర్మ. వయో వృద్ధురాలి పాత్రలో ఆమె చూపించబోయే నటనే ఈ చిత్రానికి అసలు సిసలైన హైలైట్ అని తెలుస్తోంది.