Begin typing your search above and press return to search.

ప్రియుడి కోసం వెతకలేదండీ బాబూ

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:30 PM GMT
ప్రియుడి కోసం వెతకలేదండీ బాబూ
X
ఒక వ‌ర్థ‌మాన క్రికెటర్ జీవితాన్ని ఆటంకాల్లోకి నెట్టేసిన తార‌గా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది అనుష్క శ‌ర్మ‌. ప్ర‌పంచ‌క‌ప్ ఈవిడ వ‌ల్లే పోగొట్టుకున్నాం అన్నంత‌గా క్రికెట్ అభిమానులు బాధ‌ప‌డిపోయారు. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ లో ఇండియా ఘోర‌ప్ర‌భావాన్ని ఇప్ప‌టికీ జ‌నాలు మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఆ క‌సి అంతా అనుష్క శ‌ర్మ‌పై కోపంగా మారిపోయింది. ఇప్ప‌టికీ ఈ భామ విరాట్‌తో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిర‌గ‌డం చూస్తుంటే అంద‌రికీ మండిపోతోంది. అయితేనేం .. ఎవ‌రెలా పోతే మాకేంటి? అన్న‌ట్టే ఉంది వీళ్ల వ్య‌వ‌హారం.

ఇటీవ‌లి కాలంలో ఏ దిల్ హై ముష్కిల్ షూటింగులో బిజీగా ఉన్న అనుష్క శ‌ర్మ.. విదేశీ షూటింగులో వింత వింత‌గా ప్ర‌వ‌ర్తించిందిట‌. త‌న క‌ళ్లు ఎవ‌రి కోస‌మో వెతుకుతున్న‌ట్టు.. ఇంకేదో కోల్పోయిన‌ట్టు క‌నిపించాయిట‌. ఆ విష‌యాన్ని యూనిట్ స‌భ్యులు గుంభ‌నంగా ముచ్చ‌టించుకోవ‌డం చర్చ‌కొచ్చింది. అనుష్క శ‌ర్మ ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తోంది? వియ‌న్నా సిటీ మొత్తం ఎందుకోసం క‌లియ‌తిరుగుతోంది? ప‌్రియుడి కోస‌మా? అత‌డికి గిఫ్ట్ కొనిద్దామ‌నా? అంటూ గుస‌గుస‌లాడుకున్నారు.

అయితే స‌స్పెన్స్‌ కి తెర తొల‌గిస్తూ.. త‌న‌కి కావాల్సిన వెజ్ ఫుడ్ కోసం వెతుకుతున్నాన‌ని చెప్పింది అమ్మ‌డు. వియ‌న్నాలో ఓన్లీ నాన్‌ వెజ్‌. నో వెజ్ ఫుడ్‌. అందుకే త‌న‌కి కావాల్సిన వెజ్ హోట‌ల్ ఎక్క‌డ క‌నిపిస్తుందా? అని తెగ తిరిగేసిందిట‌. ఈ ప్రాసెస్‌ లో స‌రిగా తిండి కూడా మానేసిందిట‌. ప్చ్ .. పాపం. .. ప్రియుడు ఆ టైమ్‌ లో త‌న కోసం ఏమీ చేయ‌లేదా?