Begin typing your search above and press return to search.

నా తప్పులో నిజాయితీ వుంది

By:  Tupaki Desk   |   30 July 2015 7:41 AM GMT
నా తప్పులో నిజాయితీ వుంది
X
అబ్దుల్ కలాం పేరు రాసే విషయంలో తాను తప్పు చేసినా... అందులోనూ నిజాయితీ ఉందంటోంది అనుష్కశర్మ.

మహనీయుడు, భారతరత్న అవార్డ్ గ్రహీత కలాంకు నివాళులు అర్పిస్తూ.. ABJ Kalam Azad అని రాయడంతో... బొద్దుభామ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నించి, రెండోసారి కూడా మిస్టేక్ రాసింది. ఇక రెచ్చిపోయిన నెటిజన్లు రీట్వీట్‌ లతో పిల్లదాని ప్రొఫైల్ పేజ్‌ ని నింపేశారు.

నేను తప్పు చేసినా అందులో నిజాయితీ ఉంది. నా ఉద్దేశ్యం అర్ధం చేసుకోకుండా తప్పులు వెతుకుతున్నారు. కానీ నేను ఏ ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ చేశానో నాకు తెలుసని చెప్పింది అనుష్క శర్మ. ఒకవైపు తప్పు చేశానంటూనే... మరోవైపు తనపై విమర్శలు చేసినవారిని చెడుగుడు ఆడేసింది అందాల అనుష్క.

తప్పుడు పేర్లతో ప్రొఫైల్స్ సృష్టించుకుని, కంప్యూటర్ స్క్రీన్ వెనకాల దాక్కుని, ఇష్టం వచ్చినట్లు రాతలు రాసే వాళ్లకు తాను సమాధానం చెప్పక్కర్లేదని, దమ్ముండే నా ముందుకొచ్చి మాట్లాడాలంటూ సవాల్ కూడా విసిరింది. మళ్లీ మాట్లాడితే సినిమా ల్లోలా ఫైటింగ్ చేసేలా కనిపించింది ఈ హాలీవుడ్ బ్యూటీ, సారీ.. బాలీవుడ్ బ్యూటీ.