Begin typing your search above and press return to search.

అలా రెచ్చిపోతోంది ఏంటో

By:  Tupaki Desk   |   21 Feb 2017 8:27 AM GMT
అలా రెచ్చిపోతోంది ఏంటో
X
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఎప్పుడూ సెన్సేషనే. సినిమాల్లోనూ.. పర్సనల్ లైఫ్ లోనూ ఈమె గురించి బోలెడన్ని న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. విరాట్ కోహ్లీ ప్రేమాయణం కారణంగా వీటి కౌంట్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా జీక్యూ మేగజైన్ కోసం అనుష్క శర్మ చేసిన ఫోటో షూట్ మరో సంచలనం అయిపోతోంది

అందాల మోత మోగించడంలో అందరికంటే ముందుండే అనుష్క శర్మ.. ఈ స్పెషల్ ఫోటో షూట్ లో మరింతగా రెచ్చిపోయింది. డీప్ కట్ నేవీ బ్లూ డ్రెస్ లో తన సోకులతో మాయ చేసేసింది. అనుష్క డ్రస్ మరీ లోనెక్ డిజైన్ కావడంతో.. క్లీవేజ్ అందాల ఆరబోత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఒక కాలిని కనీసం నెట్టెడ్ డిజైన్ తో అయినా కవర్ చేస్తున్నా.. మరో కాలిని మాత్రం ఓపెన్ గా వదిలేసింది ఈ సుందరాంగి. స్లీవ్ లెస్ డ్రెస్ కావడం.. తలపై ఓ చేతిని ఆనించి పోజ్ ఇవ్వడంతో.. అమ్మడి షోకుల వర్ణన మాటలకు అతీతంగా మారిపోయింది.

ప్రస్తుతం ఫిలౌరీ మూవీని నిర్మించి మరీ తనే నటించిన అనుష్క శర్మ.. ఆ మూవీ ప్రచార కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది. మార్చ్ 24న విడుదల కానున్న ఈ చిత్రంతో అందాల దెయ్యంగా నటిస్తున్న అనుష్క శర్మ.. ప్రొడ్యూసర్ గా ట్యాలెంట్ చూపించేస్తానని ధీమాగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/