Begin typing your search above and press return to search.

అనుష్క శర్మకు అరుదైన గౌరవం..

By:  Tupaki Desk   |   11 July 2018 6:18 AM GMT
అనుష్క శర్మకు అరుదైన గౌరవం..
X
అనుష్క శర్మ.. బాలీవుడ్ హీరోయిన్ గా వెలుగు వెలిగి.. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోంది. ప్రస్తుతం మూడు ఫేమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అనుష్క శర్మ నటిస్తూ బిజిగా ఉంది. ఈ సినిమాలతో అనుష్క మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ - హాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన అనుష్కశర్మకు ప్రస్తుతం అరుదైన గుర్తింపు లభించింది. సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అనుష్క మైనపు బొమ్మను పెట్టడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఆమె కొలతలు కూడా తీసుకున్నారు. అనుష్కతో పాటు అంతర్జాతీయ పేరుపొందిన ఓప్రా విన్ ఫ్రె - క్రిస్టియానో రోనాల్డో - లూవీస్ హమిల్టన్ మైనపు బొమ్మలను కూడా ఇక్కడ పెట్టబోతున్నారు. ఇలా దిగ్గజాల సరసన అనుష్క చోటు సంపాదించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.