అనుష్క ఇంత కాపీ కొట్టేసిందా?

Wed Oct 11 2017 14:38:34 GMT+0530 (IST)


బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సూపర్ హాట్ అనే సంగతి తెలిసిందే. అటు మూవీస్ లో హీరోయిన్ గా వెలిగిపోవడమే కాదు.. ఇటు ప్రొడ్యూసర్ గానూ వెలుగులు విరజిమ్ముతోంది. మంచి సినిమాలు తీస్తోందనే గుర్తింపును కూడా సంపాదించకుంది. ఇప్పుడు చాలా మంది స్టార్స్ కు సినిమాలతో  పాటే ఏదో ఒక  వ్యాపారంలో కూడా పాదం మోపడం.. తామే ప్రమోషన్ చేసేసుకుంటూ ఆయా బ్రాండ్స్ కు ప్రాచుర్యం ఆపాదించడం వంటివి జరుగుతున్నాయి.సోనమ్ కపూర్.. షాహిద్ కపూర్ వంటి వారు ఇలా ఫ్యాషన్ బ్రాండ్స్ ను స్టార్ట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా అనుష్క శర్మ కూడా ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. తనే లాంఛ్ చేసి ఓ గ్రాండ్ ఈవెంట్ లో ఫ్యాషన్ వేర్ ను రిలీజ్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ.. సోనమ్ కపూర్ ప్రమోట్ చేస్తున్న ఈ ఫ్యాషన్ వేర్ పై ఇప్పుడు కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చైనీస్ కంపెనీలు సోనమ్ కపూర్ స్వయంగా లాంఛ్ చేసిన ఓ డ్రెస్ ను చూపిస్తూ.. ఇది పక్కా కాపీ అనేస్తున్నాయి. బ్లాక్ జాకెట్ పై ఫ్లవర్ డిజైన్స్ ఉన్న డిజైన్.. నిజంగానే కాపీ అనిపించేస్తుంది.

అయితే.. ఈ ఫ్యాషన్ వేర్ డిజైన్స్ పై తాము ఎంతో రీసెర్చ్ చేశామని అనుష్క శర్మ చెబుతోంది. కానీ ఈ డైరెక్ట్ కాపీ అనే విషయంపై మాత్రం ఇంకా అనుష్క శర్మ రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ వేర్ కు చాలానే డిమాండ్ ఉంది కానీ.. సొంతగా స్పెషలైజ్డ్ డిజైన్స్ అందిస్తే మాత్రమే ఈ మార్కెట్ లో నిలబడేందుకు అవకాశం ఉంటుంది. కానీ అనుష్క శర్మకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలేయడంతో.. ఈ బిజినెస్ ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి.