సావిత్రి అండ్ జమున.. ఫీలవుతారేమో!!

Fri Apr 21 2017 19:23:01 GMT+0530 (IST)

త్వరలోనే పాతకాలం తెలుగు హీరోయిన్ సావిత్రి చరిత్రను ప్రపంచానికి చెప్పడానికి ''మహానటి'' అనే సినిమాతో వస్తున్నాడు ఎవడే సుబ్రమణ్యం ఫేం డైరక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మలయాళ కుట్టి కీర్తి సురేష్ టైటిల్ పాత్రను పోషిస్తుంటే.. సమంత కూడా ఒక పాత్రలో నటిస్తోంది. అయితే ఇప్పుడు సావత్రికి ప్రధాన కాంపిటీటర్.. అప్పట్లో సావత్రి తరువాత నెం.2 పొజిషన్లో రాణించిన హీరోయిన్ జమున పాత్రను.. అనుష్క పోషిస్తుంది అంటున్నారు. అసలు ఈ మొత్తం క్యాస్టింగ్ చూస్తుంటే.. సావిత్రి అండ్ జమున ఫీలవుతారేమో అనిపిస్తోంది.

నిజానికి సావిత్రి పాత్రకు తెలుగుమ్మాయిని ఎవరినైనా ఎంపిక చేసుంటే బాగుండేది. కాని మనోళ్లు మాత్రం కీర్తిసురేష్ ను పట్టుకొచ్చారు. అయితే కెరియర్ తొలినాళ్ళలో సావత్రి చాలా సన్నగా ఉండేది.. చివర్లో బొద్దుగా తయారైంది. మరి కీర్తి సురేష్ ఈ తేడాలన్నీ ఎలా చూపిస్తుంది అనేదే ప్రశ్న. ఇకపోతే అనుష్కను ఇప్పుడు చూస్తే చాలా బొద్దుగా ఉంది. కాని జమున వయస్సులో ఉన్నప్పుడు అంత లావుగా లేదు. మరి జమున క్యారక్టర్ అనుష్క వేసేస్తే సెట్టవుతుందా? సన్నబడితే కాని సింక్ అవ్వదేమో కదూ.

అటు కీర్తి సురేష్.. ఇటు అనుష్క కూడా.. కాస్తంత సన్నబడితే ఈ రోల్స్ కు న్యాయం చేసిన వారవుతారు. లేదంటే ఈ మహానటీమణుల అభిమానులు తప్పకుండా ఫీలవుతారు. కాకపోతే అనుష్క కనుక జమున పాత్ర చేస్తే.. ఒక కన్నడ అమ్మాయి పాత్రను మరో కన్నడ అమ్మాయి వేసినందుకు వాళ్ళు బాగానే హ్యాపీ ఫీలయ్యే ఛాన్సుంది.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/