Begin typing your search above and press return to search.

ప్రభాస్ ని అన్నయ్య అనలేను

By:  Tupaki Desk   |   18 Jan 2018 10:13 AM GMT
ప్రభాస్ ని అన్నయ్య అనలేను
X
ప్రబాస్ ని అన్నయ్య అనలేను..అబ్బాయిలందర్ని మనం అన్నయ్య అని అనుకోలేము కదా అలాగే ప్రభాస్ ని కూడా అలా అనుకోను. మా మధ్య ఒక మంచి స్నేహం ఉందని అనుష్క తన ఆలోచనని బాగమతి ఆడియో వేడుకలో చక్కగా వివరించింది. తన పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వస్తున్నాయని చెబుతూ.. నా పెళ్లి గురించి ఆలోచించడమే మనేశాను మీరే ఒక మంచి అబ్బాయిని చూడండి అని చెప్పడంతో స్వీటీ మాటలకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన భాగమతి ఆడియో వేడుక బుధవారం తమిళనాడులో జరిగింది.

అయితే వేడుకలో అనుష్క చాలా సేపు మాట్లాడింది. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యూవీ క్రియేషన్స్ అండ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దర్శకుడు సినిమాను చాలా బాగా తెరకెక్కించాడని తెలిపింది. సంచల అనే ఐఏఎస్ అధికారి పాత్రలో తను కనిపిస్తాను అంటూ భాగమతికి తన పాత్రకు సంబంధం ఏంటి అలాగే ఆమె అలా ఎందుకు మారింది అనేదే అసలు కథ అని వివరించింది. ఇక సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. వారి పాత్రలు కూడా సినిమాలో చాలా కీలకం అని అనుష్క తెలిపింది.

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఎక్కువగా థ్రిల్లర్ కథలే వస్తున్నాయి. నాకు రొమాంటిక్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ స్క్రిప్ట్ చాలా బావుండడంతో అలాంటి కథలకు ఒకే చెబుతున్నా. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నన్ను అరుంధతి సినిమాకి ఎంచుకోకుంటే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాను. ఇక పూరి జగన్నాథ్ కూడా నాకు గురువు లాంటి వారు. అన్ని ఆయనే నేర్పించారు. త్వరలో గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేయబోతున్నా. మరోసారి రాజమౌళితో కూడా వర్క్ చేయాలని ఉందని అనుష్క తెలిపింది.