Begin typing your search above and press return to search.

స్వీటీకి దక్కని స్వీట్ సక్సెస్

By:  Tupaki Desk   |   1 Dec 2015 5:30 PM GMT
స్వీటీకి దక్కని స్వీట్ సక్సెస్
X
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే అనుష్క తప్ప.. వేరే పేరు వినిపించనంత క్రేజ్ సంపాదించుకుంది. కోలీవుడ్ లోనూ మంచి హిట్స్ కొట్టి.. అనుష్కను నమ్మేసి 50 కోట్లు పోసేయచ్చు అని నిర్మాతలు అనుకునేలా చేసింది. కానీ ఓ ఏడాదిగా తన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. ఒక్క బాహుబలి తమ్మ స్వీటీ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఏవీ లేవు.

రజినీకాంత్ తో కలసి నటించిన లింగ సూపర్ ఫ్లాప్ అయితే.. , అజిత్ తో చేసిన ఎన్నై ఆరిందాల్ (తెలుగులో ఎంతవాడు గానీ) యావరేజ్ గా నిలిచింది. రుద్రమదేవి కూడా మీడియం స్థాయిలోనే ఆగిపోయింది. ఆ కాస్త క్రెడిట్ ని కూడా గుణశేఖర్, అల్లు అర్జున్ తన్నుకుపోయారు. ఇక స్వీటీ సింగిల్ గా దున్నేస్తుందని ఇండస్ట్రీ ఆశించిన సైజ్ జీరో.. వీకెండ్ తర్వాత నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈ మూవీకంటే.. ముందు వారం వచ్చిన కుమారికే కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇంత భారీగా కలెక్షన్స్ పడిపోవడం చూశాక.. ఇది ఫ్లాప్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే.. క్రేజీ ప్రాజెక్టులనే యాక్సెప్ట్ చేస్తున్నా.. ఇంతగా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడానికి కారణాలేంటో అన్వేషించాల్సి ఉంది. తన పాత్రకు ఇంపార్టెన్స్ చూసుకుంటోంది తప్ప.. మూవీలో మిగతా విషయాలని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సైజ్ జీరోనే చూస్తే.. బరువు పెరిగి మరీ కష్టపడ్డా ఫలితం దక్కలేదు. రుద్రమదేవిని తెరపైకి తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నై అరిందాల్. లింగా చిత్రాలు పూర్తిగా హీరో ఓరియెంటెడ్. ఒకవేళ ఇవి హిట్ అయినా.. క్రెడిట్ వారికే వెళ్లిపోతుంది. అభిమానులు, నిర్మాతలు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలంటే.. కేరక్టర్ లో వేరియషన్ మాత్రమే కాదు.. సినిమాలోనూ దమ్ముండాలని.. అనుష్క శెట్టికి ఎవరు చెబ్తారో ?