Begin typing your search above and press return to search.

మార్స్‌ ఓకె.. మరి మన హిస్టరీ? -అనుష్క

By:  Tupaki Desk   |   8 Oct 2015 11:02 PM GMT
మార్స్‌ ఓకె.. మరి మన హిస్టరీ? -అనుష్క
X
మరో గంటలో.. రుద్రమదేవి వచ్చేస్తుంది. డైరెక్టర్ తన ప్రాణాలన్నీ పెట్టిన తీసిన మూవీని ప్రమోట్ చేసేందుకు.. ఈ మూవీ హీరో అనుష్క బాగానే కష్టపడుతోంది. అదేంటీ అనుష్క హీరోయిన్ కదా.. హీరో అంటారేంటి అనుకోకండి. రుద్రమదేవికి సంబంధించినంతవరకూ అనుష్కనే హీరో. డైరెక్టర్ గుణ, రాణా ఈ విషయాన్ని ముందే ఫిక్స్ అయిపోయి సినిమా చేశారట.

షూటింగ్ సంగతులను ప్రేక్షకులతో పంచుకుంటోంది అనుష్క. ఓసారి మేకప్ లేకుండా అనుష్కని చూసిన గుణశేఖర్ గుర్తుపట్టలేదట. అయితే రుద్రమ అంటే ఆయనకి బ్రెయిన్ లో ప్రింట్ ఉండడంతో.. ఆ మేకప్ లేకుండా గుర్తుపట్టలేకపోయాడట గుణశేఖర్. ప్రస్తుతం రుద్రమదేవి అని గూగుల్ లో టైప్ చేస్తే అన్నీ తన ఫోటోలే వస్తున్నాయని.. ఇప్పటివరకూ ఎవరూ చూడని ఎవరికీ తెలియని రుద్రమదేవి లుక్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెబుతోంది అనుష్క.

అరుంధతి తర్వాత అలాంటి ఆఫర్స్ చాలా వచ్చాయట స్వీటీకి. అయితే.. అవే తరహా పాత్రలు కావడంతో రిజెక్ట చేసిన అనుష్క.. రుద్రమ కేరక్టర్ గురించి విన్నాక షాక్ తిన్నానని చెబ్తోంది. ఇది నిజంగా జరిగిందా అని నమ్మడం కష్టమైన చరిత్ర అంటోంది అనుష్క. మార్స్ కి ఉపగ్రహాలు పంపుతూ.. అక్కడేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మనం.. మన చరిత్రలో ఉన్న ఇలాంటి పవర్ఫుల్ కేరక్టర్ గురించి తెలీకపోవడం సిగ్గు చేటు అంటోంది. పాఠాలు రాసేవాళ్లు, నేర్పేవాళ్ల చేస్తున్న తప్పు ఇదని.. ఇలాంటి వ్యక్తుల గురించి తెలిస్తే చాలామంది ఇన్ స్పైర్ అవుతారంటోంది అనుష్క.

హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడం పైనా స్పందించింది స్వీటీ. హీరోలకు డామినేటెడ్ ఇండస్ట్రీ అని తాను అనుకోనని.. వాళ్లకి చాలా కష్టాలు, బాధ్యతలు ఉంటాయని చెబ్తోంది. యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్, లుక్స్, డైలాగ్స్.. ఇలా అన్నిటిలోనూ వాళ్ల మీద ఎన్నో అంచనాలు ఉంటాయని.. వాటి అందుకునేందుకు ఒత్తిడి ఫేస్ చేస్తుంటారని చెప్పింది అనుష్క. ఏళ్ల తరబడి ఎంతో కష్టబడి చేసిన తమ రుద్రమదేవిని పైరసీలో చూసి ప్రోత్సహించద్దంటూ.. కోరుకుందీ అభినవ రుద్రమదేవి.