Begin typing your search above and press return to search.

ఆమెకిది ఆచితూచి అడుగేయాల్సిన సమయం

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:30 AM GMT
ఆమెకిది ఆచితూచి అడుగేయాల్సిన సమయం
X
బొమ్మాళిగా భలే ముద్దులొలుకుతూ, జేజెమ్మగా జేజేలు కొట్టించుకున్న స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క వరుసపెట్టి అగ్రకధానాయకుల సరసన నటించి కెరీర్ ని బంగారు బాటగా మలచుకుంది. ఆ తరువాత వరుసగా తమిళ చిత్రాలపై దృష్టిపెట్టడంతో తెలుగులో మార్కెట్ సన్నగిల్లినా అవకాశాలకు మాత్రం ఢొకా లేదు.

అయితే అనుష్క ఫలితానికి తగ్గ ప్రతిఫలాలు రాకపోవడం బాధాకరం. బాహుబలి మొదటిభాగంలో అనుష్క మేక్ అప్ పై విమర్శలు వినిపించాయి. రుద్రమదేవిలో అంతా తానే అయ్యి నడిపించినా ప్రశంసలు కరువయ్యాయి. ఇప్పుడు ఒక్క సినిమా కోసం 20కే.జిలు బరువు పెరిగి తగ్గినా ఫలితం లేకపోయింది.

ప్రస్తుతం బాహుబలి 2 - సింగం 3 లలో నటిస్తున్న అనుష్క ఆ సినిమాలకు హైప్ వుండడంతో నెట్టుకు వచ్చినా తదుపరి ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తేనే టాలీవుడ్ లో తన ఉనికిని చాటుకోగలదని సినీ పండితుల భావన.