Begin typing your search above and press return to search.

స్వీటీ అభిమాని హైట్ చూశారా?

By:  Tupaki Desk   |   9 Dec 2017 4:55 PM GMT
స్వీటీ అభిమాని హైట్ చూశారా?
X
ఎంత అందమైన హీరోయిన్స్ అయినా సౌత్ లో అనుష్క రేంజ్ లో ప్రస్తుతం సత్తా చాటలేకపోతున్నారనే చెప్పాలి. స్వీటీ దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలను తీసింది. అరుంధతి - బాహుబలి లాంటి ఎన్నో భారీ బడ్జెట్ బాక్స్ ఆఫీస్ సినిమాల్లో కూడా నటించింది. ఆమె ఎంచుకున్న సినిమాలే ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. స్టార్ హీరోల లెవెల్ లో అభిమానులను సంపాదించుకొని ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు.

ఒక రేంజ్ లో తన ఇమేజ్ ని నిలుపుకుంటూ వచ్చిన అనుష్క తన అభిమానులు ఎప్పుడు కలవడానికి వచ్చినా స్వీట్ గా పలకరిస్తుంది స్వీటీ. అయితే రీసెంట్ గా అనుష్క ఒక లేడి ఫ్యాన్ తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇది రీసెంట్ గా దిగిన ఫొటో ఏం కాదు పాతది అనే విధంగా హ్యాష్ ట్యాగ్ తో చెప్పేసింది. అయితే అనుష్క ఎంత హైట్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.

అయితే ఆమె హైట్ కంటే ఎక్కువగా ఆమె అభిమాని పొడవుగా (5.10ft) ఉండడం చూసి అనుష్క కొంచెం థ్రిల్ అయ్యిందట. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో కొంచెం హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే అనుష్క ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.