మాస్ యాక్షన్ మూవీలో స్వీటీ

Thu May 17 2018 10:20:05 GMT+0530 (IST)

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి.. గత కొంతకాలంగా గ్లామర్ రోల్స్ కు బాగా దూరం అయిపోయింది. తనకు ఇంతటి ఇమేజ్ ను కట్టబెట్టిన మాస్ ఆడియన్స్ కు అనుష్క దూరం కావాల్సి వచ్చింది. ఇందుకు అనుష్క వెయిట్ కారణం అనే సంగతి తెలిసిందే. స్ట్రెయిట్ కమర్షియల్ చిత్రాలను ఒప్పుకునేందుకు వీలు కావడం లేదు. సింగం3 అంటూ సూర్యతో చేసిన మూవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు.ఈ ఏడాది ఆరంభంలో భాగమతి అంటూ బంపర్ హిట్ కొట్టేసింది అనుష్క. ఆ తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్లే రావడంతో మన స్వీటీ ఒప్పుకోలేదు. దీంతో కొత్త ప్రాజెక్టులు వేటికీ అనుష్క సైన్ చేసే ఛాన్స్ రాకపోవడంతో.. ఈమె పెళ్లి గురించి వార్తలు తెగ వినిపించేశాయి. ఇప్పుడు అనుష్క తమ చిత్రానికి సైన్ చేసిందంటూ అనౌన్స్ చేసి.. నా నువ్వే దర్శక నిర్మాతలు షాక్ ఇచ్చేశారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్-తమన్నాలతో లవ్ స్టోరీని రిలీజ్ చేస్తున్నారు దర్శకుడు జయేంద్ర అండ్ ప్రొడ్యూసర్ లు కిరణ్.. విజయ్.

గోపీచంద్ హీరోగా రూపొందే ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో అనుష్క పాత్ర కూడా హైలైట్ అవుతుందని మేకర్స్ చెబున్నారు. గతంలో కూడా గోపీచంద్-అనుష్క కలిసి నటించి మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఈ కాంబో సాధ్యం అవుతుండగా.. మళ్లీ ఇన్నేళ్లకు పూర్తి స్థాయి మాస్ ఓరియెంటెడ్ మూవీలో అనుష్క సైన్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.