Begin typing your search above and press return to search.

అనుష్క దెబ్బేసే ఛాన్సులు ఉన్నాయ్

By:  Tupaki Desk   |   20 April 2017 12:18 PM GMT
అనుష్క దెబ్బేసే ఛాన్సులు ఉన్నాయ్
X
అసలు బాహుబలి 2 సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని రాజమౌళి అండ్ టీమ్ అంతా వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగం మీద పెద్దగా లాభాలు తెచ్చుకోలేదని.. రెండో భాగం ఆడితేనే మాకు కాస్త డబ్బులు వస్తాయని ప్రొడ్యూసర్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు అసలు మైనస్ పాయింట్లు అంటూ ఏమీ లేవు కాని.. ఒకే ఒక్క డిజప్పాయింట్ చేసే చిన్న పాయింట్ మాత్రం ఉంది.

నిజానికి మొన్న రిలీజ్ చేసిన బాహుబలి వర్కింగ్ స్టిల్స్ కూడా చూసుకుంటే.. హీరోయిన్ అనుష్క చాలా స్లిమ్ గా అందంగా ఉంది. ఆమె లుక్ లో ఎంతో హాట్నెస్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా దేవసేన క్యారెక్టర్లో ఆమె ఫైట్లు చాలామటుకు ఇదే లుక్కులో తీశారట. అయితే తరువాత అనుష్క సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగిన తరువాత.. ఆమె మళ్ళీ సన్నబడాలని ప్రయత్నించిన తరువాత.. ఆమెతో చాలా సీన్లు తీశారు. ఈ సీన్ల కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి ఆమెను నాజూకుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. అవన్నీ సరిగ్గా వస్తే ఓకె.. లేకపోతే అనుష్క సినిమాలో ఒక్కో చోట ఒక్కో వెయిట్ లో కనిపిస్తే.. నెరేషన్ కు కాస్త అడ్డుపడే ఛాన్సుందిలే అంటున్నారు సినీ విమర్శకులు.

ఏదేమైనా కూడా ఈ ఊహాగానాలన్నీ కేవలం మరో వారం రోజులు మాత్రమే. ఆ తరువాత బాహుబలి 2 సినిమా కథ కథనం ఎలా ఉండబోతున్నాయి.. అనుష్క లుక్స్ ఏం చేస్తాయి అనే విషయంపై పక్కాగా క్లారిటీ వచ్చేస్తుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/