Begin typing your search above and press return to search.

నాగ్ మాటలు మార్మోగుతూనే ఉంటాయి-అనుష్క

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 PM GMT
నాగ్ మాటలు మార్మోగుతూనే ఉంటాయి-అనుష్క
X
ఓ హీరోయిన్ ఐదారేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడమే కష్టం. అలాంటిది అనుష్క పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. పైగా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా.. కెరీర్ పీక్స్ లో కొనసాగుతుండటం విశేషం. దీనికి ముఖ్య కారణం.. అక్కినేని నాగార్జున అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరులో యోగా టీచర్ గా పని చేస్తున్న అనుష్కను టాలీవుడ్ లోకి తీసుకొచ్చింది ఆయనే. తన సంస్థలో తీసిన ‘సూపర్’ సినిమాలో ఛాన్స్ ఇప్పించిన నాగ్.. ఆ తర్వాత కూడా అనుష్క కెరీర్ విషయంలో సలహాలిచ్చి, తన సినిమాల్లో అవకాశాలిప్పించి ఆమె స్టార్ హీరోయిన్ గా నిలబడ్డానికి సాయపడ్డారు. నాగ్ విషయంలో అనుష్క కూడా కృతజ్నత మరిచిపోలేదు. హీరోయిన్ గా తన ప్రస్థానం గురించి మాట్లాడినప్పుడల్లా నాగ్ ప్రస్తావన తెస్తుంది అనుష్క.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లోనూ తనకు నాగ్ చేసిన సాయం గురించి మాట్లాడింది అనుష్క. ‘‘నేనీ స్థాయిలో ఉండటానికి చాలామంది కారణం. నాగార్జున - పూరి జగన్నాథ్ - శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. వీళ్లందరికీ నా కెరీర్ తాలూకు క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా నాగార్జున గారు సూపర్ సినిమా సమయంలో ఎంత బాగా చూసుకున్నారో చెప్పలేదు. సెట్లో నన్నో చిన్నపిల్లలా ట్రీట్ చేశారు. పరిశ్రమ గురించి నాకేం తెలియదు. ఎలా ఉండాలో అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో ఆయన ‘కష్టపడు. ఎదగడానికి అందుకు మించిన మార్గం లేదు’ అని నాగార్జున చెప్పిన మాటలు నా చెవిలో మార్మోగుతూనే ఉంటాయి. నా తొలి ఏడాది చాలా గందరగోళంగా నడిచింది. నేను సినిమాలు చేయను. ఇంటికెళ్లిపోతా, చదువుకుంటా అని ఏడ్చేదాన్ని. అలాంటిది పదేళ్లకు పైగా కెరీర్ కొనసాగిందంటే నాగార్జున సహా దర్శకులు నిర్మాతలిచ్చిన ప్రోత్సాహమే కారణం’’ అని అనుష్క చెప్పింది.