Begin typing your search above and press return to search.

స్వీటీ వాటిని మళ్లీ స్టార్ట్ చేసేసిందట

By:  Tupaki Desk   |   31 May 2016 5:59 AM GMT
స్వీటీ వాటిని మళ్లీ స్టార్ట్ చేసేసిందట
X
స్వీటీ అనుష్క రేంజ్ బాగా పెరిగిపోయింది. లీడ్ రోల్స్- ఇంపార్టెంట్ కేరక్టర్స్ - లేడీ ఓరియెంటెడ్ మూవీస్.. ఇలా బరువైన బాధ్యతలను మోసేస్తోంది అనుష్క. అందుకోసం తన ఒరిజినల్ కేరక్టర్ ని పక్కన పెట్టి మరీ పెద్దరికంతో వ్యవహరించాల్సి వస్తోంది. అసలు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అయితే.. అనుష్కను అందరూ పార్టీ గాళ్ అనేవారు. ఆ తర్వాత ఎక్కడా ఆ మాటే వినిపించలేదు. ఇందుకు కారణం.. కేరక్టర్స్ - సినిమాలు - తనకు లభించిన గుర్తింపు, వచ్చిన పేరు కారణంగా.. తెచ్చిపెట్టుకున్న పెద్దరికమే.

ముఖ్యంగా తెలుగులో అనుష్కకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అందుకే.. హైద్రాబాద్ లో ఉన్నంతవరకూ పార్టీలకు డుమ్మా కొట్టేయడం మొదలుపెట్టింది స్వీటీ. పైగా అనుష్కలో ఈ మధ్య భక్తి కోణం కూడా బాగా ఎక్కువైపోయిందట. అమ్మడిని పార్టీలకు దూరం చేయడంలో దేవుడు కూడా ఓ కీలకమైన పాత్రను పోషించాడు. వీటన్నిటికి తోడు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ - కమిట్ మెంట్స్ కారణంగా.. వాటి షూటింగ్ షెడ్యూల్స్ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా ఉంటోందని అంటున్నారు.

ఇప్పుడు అనుష్కలో మళ్లీ పార్టీగాళ్ బయటకొచ్చిందని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన కొందరు కుర్ర హీరోయిన్లు.. మళ్లీ అనుష్కలోని పాత భామను బయటకు తెచ్చారట. అందరూ కలిసి పార్టీలు తెగ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే.. ఇదంతా బెంగళూరుకి మాత్రమే పరిమితం. ఇక్కడ అంతా ష్.. గప్ చుప్.