Begin typing your search above and press return to search.

అనుష్క బికినీ టాప్స్.. అదుర్స్..

By:  Tupaki Desk   |   2 May 2016 3:30 PM GMT
అనుష్క బికినీ టాప్స్.. అదుర్స్..
X
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ఇప్పుడు మహా జోష్ లో ఉంది. టాప్ ప్లేస్ టాప్ కంటెండర్ అయిన అనుష్క.. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఎక్కడ కనిపించినా మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు సినిమాల కౌంట్ బాగా తగ్గించినా.. చేసే వన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కావడంతో.. అమ్మడి డిమాండ్ ఆకాశంలోనే ఉంటోంది.

మేగజైన్స్ కోసం ఇచ్చే ఫోటో సెషన్స్ లో కూడా అనుష్క మేకోవర్ స్పెషల్ అవుతోంది. ముఖ్యంగా విరాట్ తో లవ్ ఎఫైర్ కారణంగా.. వార్తల్లో నానుతోంది అనుష్క.. బ్రేకప్ లాంటి వార్తలెన్ని వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన కెరీర్ ని మాత్రం టాప్ స్వింగ్ లో కంటిన్యూ చేస్తున్న అనుష్క శర్మ.. వోగ్ మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చింది. కవర్ పేజ్ పై ట్రాన్స్ పరెంట్ డ్రస్సుల్లోంచి స్విమ్ వేర్ తో అందాల కనువిందు చేస్తే.. ఇక లోపలి పేజీల్లో అయితే.. అనుష్క విశ్వరూపమే చూపించింది. ఈ మేగజైన్ లో అనుష్క ఒక్కో ఫోటో ఒక్కో స్పెషల్ కాగా.. బికినీ టాప్స్ తో దర్శనమిచ్చిన ఫోటో ఒకటి ఒక ఎత్తు అనాల్సిందే.

రెడ్ కలర్ గౌన్ - బ్లాక్ కలర్ బికినీ టాప్ వేసుకుని.. కుర్చీపై వయ్యారంగా కూర్చుని ఇచ్చిన ఫోజుకి.. ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ చిన్నది సుల్తాన్ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సొగసరిగానే గుర్తింపు ఉన్న ఈమె.. రెజ్లర్ గా మారిపోయి ఫైట్స్ కూడా చేసేయడంతో.. ఫ్యాన్స్ కూడా సుల్తాన్ కోసం వెయిట్ చేస్తున్నారు.