Begin typing your search above and press return to search.

అసలు అనుష్క సెట్టయ్యిందా??

By:  Tupaki Desk   |   13 Feb 2016 3:43 AM GMT
అసలు అనుష్క సెట్టయ్యిందా??
X
ఒక్కోసారి క్యాస్టింగ్‌ లోపం కారణంగా కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. మనవి కమర్షియల్‌ సినిమాలు కాబట్టి.. ఎవరిని ఏ రోల్ కు క్యాస్ట్‌ చేసినా కూడా జనాలు చూసేస్తారు అనుకోవడం మాత్రం కాస్త కామెడీయే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్‌ అలాంటివి చాలా సీరియస్‌ గా తీసుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న ఒక హీరోయిన్‌ అనుష్క శర్మ. అమ్మడు 'సుల్తాన్‌' సినిమా కోసం కుస్తీలతో పట్టుపడుతోంది. ఈ సినిమాలో వ్రెజ్లర్‌ గా నటిస్తున్న అనుష్క.. అపోనెంట్‌ ను రింగ్‌ లో ఎలా తోసేయాలో టెక్నిక్కులు ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆ వీడియోలు - ఫోటోలు చూస్తుంటే మాత్రం.. అనుష్క హాట్‌ గా ఉందే అనే థాట్‌ రాక మానదు. ఆపండి మీ చిలిపి థింకింగ్‌.. ఎందుకంటే అక్కడ అనుష్కను చూస్తే.. ఈ ఊస కాళ్ళ సుందరి అసలు ఒక కుస్తీ క్రీడాకారిణిగా ఎలా సెట్టవుతుంది అనే సందేహం వస్తోంది ముందు. ఇంత బక్కగా ఉన్నమ్మాయి వ్రెజ్లర్‌ అంటే ఆడియన్స్‌ ఎలా నమ్ముతారు మరి?

సేమ్‌ టు సేమ్‌ ఇదే సబ్జెక్ట్‌ పై అమీర్‌ ఖాన్‌ 'దంగాల్‌' అనే సినిమాను చేస్తున్నాడు. పాత్ర కోసం ఎంత వెయిట్‌ పెరిగాడో తెలిసిందే. మరి సల్మాన్‌ పక్కన ఈ ఊస కాళ్ళ సుందరి ఇలా కుస్తీలు పడుతుంటే మాత్రం క్యారెక్టర్‌ కు అస్సలు మ్యాచ్‌ అవ్వట్లేదు. ఏ యాంగిల్‌లో కూడా సెట్టయినట్లు అనిపించట్లేదు.