Begin typing your search above and press return to search.

స్వీటీ ఫ్యాన్స్ సంబరాలు కష్టమేనా

By:  Tupaki Desk   |   20 Feb 2017 9:10 AM GMT
స్వీటీ ఫ్యాన్స్ సంబరాలు కష్టమేనా
X
టాలీవుడ్ బ్యూటీ అనుష్క రేంజే వేరు. లో బడ్జెట్ మూవీస్ మాత్రమే కాదు.. ఎంత బడ్జెట్ పెట్టినా.. హీరోయిన్స్ సింగిల్ హ్యాండ్ తో సినిమాలు లీడ్ చేయచ్చు అన్న విషయాన్ని ప్రూవ్ చేసింది. అరుంధతి.. రుద్రమదేవి లాంటి కేరక్టర్స్ తో రోల్ మోడల్ గా నిలిచింది. అయితే.. ఇదంతా గతమే. ప్రస్తుతం పరిస్థితి అమ్మడి చేయి దాటిపోయిందా అనిపించక మానదు.

అనుష్క ఉందంటే చాలు థియేటర్లకు దారితీసే అభిమానులు బోలెడంత మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు బోలెడంత డిజప్పాయింట్ అయిపోయారు. తాజాగా ఈ భామ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. ఒక్క రోజు తేడాలో అనుష్క నటించిన రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి సూర్య నటించిన సింగం.. రెండు నాగ్ మూవీ ఓం నమో వేంకటేశాయి. ఈ రెండింటిలో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. ఈ రెండు మూవీస్ లో అనుష్క భారీ దేహం అభిమానులను భయపెట్టేసింది.

ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న బాహుబలి ది కంక్లూజన్ లో అనుష్కదే ప్రధాన పాత్ర. కొన్ని వారాల క్రితం ఇచ్చిన పోస్టర్ లో అనుష్క సన్నగా కనిపించడం.. కేవలం గ్రాఫిక్స్ మహిమే అనే విషయం అర్ధమైపోయింది. ఇక తమ ఆరాధ్య దేవతను మునుపటిలా చూడలేమా అని బెంగ పెట్టేసుకున్నారు అనుష్క అభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/