Begin typing your search above and press return to search.

అనుష్క ఆట మొదలైంది మరి

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:34 AM GMT
అనుష్క ఆట మొదలైంది మరి
X
ఇటు టాలీవుడ్ ని అటు కోలీవుడ్ ని దాదాపు ఏడాది పాటు ఉరిస్తోన్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది అనుష్క బాగమతి అనే చెప్పాలి. బాహుబలితో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో స్వీటీ నెక్స్ట్ ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందా అని అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఫైనల్ గా సినిమా అయితే పూర్తయ్యింది.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా రీసెంట్ గా ఫినిష్ అయ్యాయి. ఇక సినిమా విడుదల కావడం ఒక్కటే మిగిలి ఉంది. జనవరి 26న సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి నుంచే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటోంది. మొదటగా తమిళ్ లో ఆడియో వేడుక ద్వారా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు. ఎందుకంటే స్వీటీకి అక్కడే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజే ఆ వేడుకను జరపనున్నారు.

ఇక తెలుగులో మీడియా ద్వారా అనుష్క ప్రమోషన్స్ ని హై లెవెల్లో చేయాలని చూస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి రిలీజ్ అయ్యే వరకు అనుష్క ప్రమోషన్స్ తోనే బిజీ కానుంది. ఇక యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు పిల్ల జమిందార్ దర్శకుడు జి.అశోక్ దర్శకత్వం వహించాడు. మరి కొన్ని రోజుల్లో బాగమతి సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకోనుంది. మరి 2018 లో అనుష్క మొదటి హిట్టు అందుకుంటుందో లేదో చూడాలి.