Begin typing your search above and press return to search.

దేవసేన కనిపించిందోచ్.. ఎన్నాళ్లకో

By:  Tupaki Desk   |   22 Oct 2016 5:30 PM GMT
దేవసేన కనిపించిందోచ్.. ఎన్నాళ్లకో
X
టాలీవుడ్ స్వీటీ అనుష్క బయట కనిపించి చాలా కాలమే అయిపోయింది. సైజ్ జీరో కోసం లావెక్కిన తర్వాత.. ఆ సైజులు తగ్గించుకోడానికి సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టేస్తోందని.. కొంచెమే తగ్గిందని.. ఇంకా తగ్గాల్సి ఉందని.. సింగం3 షూటింగ్ లో పాల్గొంటోందని.. భాగమతి మూవీలో యాక్టివ్ గా భాగమైందని.. ఫైనల్ గా బాహుబలి2 క్లైమాక్స్ షూట్ ఫినిష్ చేసిందని.. ఇలా రకరకాలుగా వినడమే తప్ప.. స్వీటీ దర్శన భాగ్యం మాత్రం అభిమానులకు కలగలేదు.

ఆ కొరతను బాహుబలి ది కంక్లూజన్ కి ఫస్ట్ లుక్ లాంఛింగ్ ఈవెంట్ తీర్చేసింది. ముంబైలో జరిగిన బాహుబలి2 ఈవెంట్ కోసం దర్శకుడు రాజమౌళి.. హీరో ప్రభాస్.. మరో హీరోయిన్ తమన్నాలతో పాటు.. అనుష్క కూడా వచ్చేసింది. ఫుల్ బ్లాక్ డ్రస్ లో ఫుల్ గా డ్రస్ చేసుకుని వచ్చేసింది. లావు విషయంలో కామెంట్స్ పక్కన పెడితే.. అసలు స్వీటీ కనిపించడమే స్పెషల్ అయిపోయిందని చెప్పాలి.

ఇక బాహుబలి2 లో అనుష్క పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. బాహుబలితో ప్రేమ.. రానాతో వైరం.. రాజ్య పాలన.. కత్తి యుద్ధాలు.. ఫైనల్ గా భల్లాలదేవుడిపై పగ తీర్చుకోవడం లాంటి సీన్స్ తో.. రెండో హీరోయిన్ తమన్నాను డామినేట్ చేసేయడం ఖాయమే. మొదటి భాగంలో అనుష్క రోల్ అంతగా లేదని ఫీలయ్యే వాళ్లకు.. బాహుబలి2 అనుష్క అందం ప్లస్ నటన బోలెడంత ఆనందం ఇచ్చేయడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/