Begin typing your search above and press return to search.

అనుష్క అలా అనేసిందేంటబ్బా!

By:  Tupaki Desk   |   18 May 2017 11:27 AM GMT
అనుష్క అలా అనేసిందేంటబ్బా!
X
టాలీవుడ్ స్వీటీ అనుష్క ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. సౌత్ అంతా ఈమెకు మంచి క్రేజ్ ఉన్నా.. టాలీవుడ్ లోనే అమ్మడి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు కాసిన్ని సైజులు మారిపోయినా అనుష్కకు ఉండే క్రేజ్.. ఇతర హీరోయిన్స్ అందుకోవడం చాలా కష్టం. అలాంటి అందాల అనుష్కకు.. ప్రభాస్ కు మధ్య సంథింగ్ అంటూ గతంలో చాలానే రూమర్స్ వచ్చాయి.

ఒక దశలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే టాక్ కూడా వచ్చింది. ఇలాంటి వాటిపై ఎపుడూ ఎవరూ స్పందించలేదు లేదు కానీ.. తాజాగా ప్రభాస్ గురించి స్వీటీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభాస్.. రానాల్లో ఎవరు సెక్సీగా ఉంటారని అనుష్కను అడిగితే అర సెకన్ కూడా తడుముకోకుండా.. ప్రభాస్ పేరు చెప్పేసింది స్వీటీ. అక్కడ రానా ప్లేస్ లో ఏ హీరో పేరు చెప్పినా అనుష్క ఆన్సర్ మాత్రం ప్రభాస్ అనిపించేంత స్పీడ్ గా ఈ జవాబు ఉండడం విశేషం.

ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ అందుకే అంతగా పండుతుంది. రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ మాంచి థిక్ ఫ్రెండ్స్ మాత్రమే. బాహుబలి విజయంలో వీరిద్దరి పాత్రల మధ్య ఉన్న కెమిస్ట్రీ కీలక పాత్ర పోషించింది. భాగమతి చిత్రంలో అనుష్క నటించడానికి కారణం కూడా ప్రభాస్ చెప్పడమే అనే టాక్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/