మోడీజీ మీ ఫాలోవర్స్ నా కూతురు రేప్ చేస్తామంటున్నారు

Fri May 24 2019 20:10:06 GMT+0530 (IST)

పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సమయంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ లో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మోడీ రెండవ సారి ప్రధాని అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూనే తాను ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మోడీకి తెలియజేసేందుకు అనురాగ్ కశ్యప్ ప్రయత్నించాడు.అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ లో... డియర్ నరేంద్ర మోడీ సర్.. మీ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో మీకో విషయంను చెప్పాలనుకుంటున్నాను. చౌకీదార్ అని పెట్టుకుని మీ ఫాలోవర్స్ అంటూ చెప్పుకుంటున్న ఈ వ్యక్తి నా కూతురును రేప్ చేస్తానంటూ బెదిరించాడు అంటూ ఒక ట్వీట్ ను తన ట్వీట్ తో పాటు పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన వ్యక్తి తన అకౌంట్ కు చౌకీదార్ రామ్ సంఘి అని పెట్టుకున్నాడు.

ఆ వ్యక్తి ట్విట్టర్ లో అనురాగ్ కశ్యప్ కూతురును ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది. అందులో మీ నాన్నకు చెప్పు మరోసారి మోడీని విమర్శించినా - వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నిన్ను రేప్ చేస్తాం. ఈ ట్వీట్ తో ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మోడీని ట్యాగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా అనురాగ్ కశ్యప్ చేశాడు.

చౌకీదార్ పెట్టుకున్నంత మాత్రన అంతా కూడా మోడీ ఫాలోవర్స్ అవ్వరు. అదేదో ఫేక్ అకౌంట్ అయ్యి ఉంటుందని బాలీవుడ్ కే చెందిన మరో సినీ ప్రముఖుడు అశోక్ పండిట్ అన్నారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.