Begin typing your search above and press return to search.

అనుపమ అరంగేట్రాలు అదిరిపోతున్నాయ్

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:18 AM GMT
అనుపమ అరంగేట్రాలు అదిరిపోతున్నాయ్
X
మలయాళ తార అనుపమా పరమేశ్వరన్ నటించిన ప్రేమమ్ మూవీ గతేడాది బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సౌత్ లోని అన్ని భాషల నుంచి ఆమెకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అయితే.. ఆఫర్లు బోలెడన్ని ఆమె దగ్గరకు వెళ్లాయి. తెలుగులో ఒక సినిమా కూడా థియేటర్లలోకి రాకుండానే మూడు ప్రాజెక్టుల్లో ఆమెను ఓకే చేశారంటే.. అనుపమ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

నితిన్ - సమంతలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీస్తున్న అ..ఆ.. మూవీలో అనుపమ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇది దాదాపు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. మలయాళ ప్రేమమ్ కి తెలుగు రీమేక్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. మజ్ను టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. తన రోల్ ని తానే చేస్తోంది ఈ మలయాళ కుట్టి. ఇవి రెండూ కాకుండా రవితేజతో ఓ ప్రాజెక్టుకు కూడా తీసుకున్నారు కానీ.. అది పట్టాలెక్కలేదు.

ఇంతలోనే ఆమెకు తమిళ్ నుంచి కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. ధనుష్ మూవీ కోడిలో ఓ హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా నిర్మిస్తుండగా, త్రిష లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ పాత్రకు షామిలీని.. ఆ తరువాత కీర్తి సురేష్‌ ను అనుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం అనుపమ పేరు ఖారారు చేసినట్లు చెబుతున్నారు. ఇలా ప్రతీ భాషలోనూ అరంగేట్ర మూవీనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో చేసే అవకాశం అందరు హీరోయిన్లకు దొరికదు. అందుకే అనుపమ అరంగేట్రాలు అదిరిపోతున్నాయి.