Begin typing your search above and press return to search.

ఈమె తెలుగు 'రాక్షసన్‌' పంతులమ్మ

By:  Tupaki Desk   |   23 Feb 2019 6:31 AM GMT
ఈమె తెలుగు రాక్షసన్‌ పంతులమ్మ
X
విష్ణు విశాల్‌ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హిట్‌ మూవీ 'రాక్షసన్‌' ను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌ వర్మ రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. రాక్షసన్‌ చిత్రంలో విష్ణు విశాల్‌ కు జోడీగా అమలా పాల్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో అమపాల పాల్‌ టీచర్‌ గా కనిపించి - సింపుల్‌ లుక్‌ తో ఆకట్టుకుంది. ఆ పాత్రకు తెలుగులో ఎవరైతే బెటర్‌ అన్న చర్చ జరిగిన సమయంలో పలువురి పేర్లు పరిశీలించి చివరకు 'ప్రేమమ్‌' బ్యూటీ అనుపమ పమరమేశ్వరన్‌ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రేజీ రీమేక్‌ లో ఛాన్స్‌ దక్కడంతో అనుపమ పరమేశ్వరన్‌ కు మరో ఛాన్స్‌ దక్కినట్లయ్యింది. రాశిఖన్నా అంటూ వార్తలు వచ్చినప్పటికి అవి పుకార్లే అని తేలిపోయింది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఈ విషయమై అనఫిషయల్‌ గా మీడియాకు సమాచారం అందింది. ఒరిజినల్‌ వర్షన్‌ లో అమలాపాల్‌ పోషించిన పాత్రకు అనుపమ పరమేశ్వరన్‌ అయితే చక్కగా సూట్‌ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కెరీర్‌ ఆరంభంలో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్‌ తేజ్‌ ఐలవ్‌ యూ - హలో గురు ప్రేమకోసమే చిత్రాలు నిరాశ పర్చడంతో మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తుంది. తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటిస్తూ బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి 'రాక్షసన్‌' రీమేక్‌ ఆ బ్రేక్‌ ను ఇస్తుందేమో చూడాలి. 'సీత' సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న బెల్లంకొండ ఆ వెంటనే రాక్షసన్‌ రీమేక్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం ఉంది. బెల్లంకొండకు, దర్శకుడు రమేష్‌ వర్మకు కూడా ఈ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం.