Begin typing your search above and press return to search.

అనుపమలో ఈ టాలెంట్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:13 PM GMT
అనుపమలో ఈ టాలెంట్ కూడా ఉందా?
X
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ''శతమానం భవతి'' సినిమా హిట్టుతో వరుసగా మూడు సినిమాల హిట్లు కొట్టేసింది. అందుకే ఆమెను అందరూ హ్యాట్రిక్ గాళ్‌ అంటున్నారు. అయితే అనుకోకుండా రామ్ చరణ్ సినిమా.. అలాగే నాని సినిమా.. మరో సినిమాను కూడా వదిలేసుకుంది. ఎన్ని వదులుకున్నా కూడా అమ్మడి చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయిలే.

ఇకపోతే తనలోని టాలెంట్ ను చెబుతూ అమ్మడు ఒక వీడియో రిలీజ్ చేసింది కొన్నేళ్ళ క్రిందట ఈమె బుల్లెట్ నడుపుతూ రయ్యమని వెళుతుంటే.. వెనుకే కూర్చున్న ఆమె తమ్మడు ఒక వీడియో తీశాడు. హెల్మెట్ పెట్టుకోకుండా అమ్మడు జుమ్ జుమ్ అంటూ రోడ్డు మీదన వెళుతుంటే.. అబ్బో ఆ డ్రైవింగ్ స్టయిలే అదిరింది అంటున్నారు ఆమె అభిమానులు. అసలు అమ్మడిలో ఎన్ని టాలెంటులు ఉన్నాయో చూసుకోండి.

కట్ చేస్తే.. తెలుగులో ఎక్కువగా గ్లామర్ తో కూడిన రోల్స్ చేయమని ఒత్తిడి చేస్తుండటంతో అమ్మడు ఇప్పుడు తమిళంలో కూడా ఒక రాయి వేయాలని చూస్తుందట. ఈ బైక్ డ్రైవింగ్ స్కిల్స్ అక్కడ బాగా ఉపయోగపడే ఛాన్సుందిలే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/