అను 'ఉప్మా' చేసేసాడే!

Tue Oct 23 2018 17:30:08 GMT+0530 (IST)

సాధారణంగా ఎవరినైనా పొగడ్తలతో ముంచెత్తినప్పుడు బిస్కెట్ అంటాం. కాని అంతకు మించిన అర్థంతో కన్ఫ్యూజ్ చేస్తే దాన్ని ఉప్మా అనాలేమో. నిన్న జరిగిన హలొ గురు ప్రేమ కోసమే సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రినాధరావు అనుపమ పరమేశ్వరన్ గురించి కాస్త వయ్యారంగా చెప్పిన మాటలు కొంత కామెడీగా కొంత వ్యంగ్యంగా అనిపించడం అందరి దృష్టిలో పడింది. షూటింగ్ స్పాట్ కు మొదటిసారి అనుపమ వచ్చినప్పుడు మేకప్ లేకుండా కారు అద్దంలో నుంచి చూసి గుర్తు పట్టలేదని ఆ తర్వాత మేకప్ తో కనిపించాక అనుపమ అని పసిగట్టానని చెప్పడం రామ్ తో సహా అందరిని నవ్వుల్లో ముంచెత్తింది.అంతే కాదు దిల్ రాజు ఆఫీస్ కు వచ్చినప్పుడు జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకుని ఇలా నడుచుకుంటూ వచ్చావు అంటూ చేసి మరీ చూపించడం కొంత ఎబ్బెట్టుగా అనిపించినా ఫైనల్ గా అందరిని నవ్వించింది. హలో గురు ప్రేమ కోసమే వీక్ డేస్ మొదలైనప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి డ్రాప్ అవుతున్న నేపధ్యంలో కాస్త బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు. అందులో భాగంగానే జరిపిందీ సక్సెస్ మీట్. హీరో రామ్ తో సహా టెక్నికల్ టీం మొత్తం హాజరైన ఈ వేడుకలో స్పీచుల రూపంలో మాటలు బాగానే పేలాయి.

నేను లోకల్ తరహాలో మెల్లగా భారీ హిట్ దిశగా వెళ్తుంది అనే అంచనాలకు భిన్నంగా హలో గురు ప్రేమ కోసమే యావరేజ్ గానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ రూపంలో సగం దాకా వచ్చేసినా ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది. 24 కోట్ల టార్గెట్ షేర్ తో బరిలో దిగిన హలో గురు ప్రేమ కోసమే దసరాను బాగానే వాడుకుంది కాని సెలవులు ముగిసిన నేపధ్యంలో నిన్నటి నుంచి అసలైన ఛాలెంజ్ మొదలైంది