Begin typing your search above and press return to search.

ఫోటోస్‌ ఫేక్‌ కాదు.. అవి మజ్నూవి కాదంతే

By:  Tupaki Desk   |   10 Feb 2016 6:04 AM GMT
ఫోటోస్‌ ఫేక్‌ కాదు.. అవి మజ్నూవి కాదంతే
X
ఇప్పుడు టాలీవుడ్‌ లో ఒక టాపిక్‌ బాగా పాపులర్‌ అయిపోయింది. అసలు క్యూట్‌ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ ''మజ్నూ'' సినిమా షూటింగ్‌ స్టిల్స్‌ అంటూ వచ్చిన ఫోటోలు ఒరిజినల్‌ కాదు.. ఫేక్‌ అవి.. అంటూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే కామెంట్లు. ఇంతకీ అసలు ఈ కామెంట్ల గురించి, అలాగే ఆ ఫోటోల గురించి అనుపమ ఏం చెప్పింది?

''అబ్బే.. ఆ ఫోటోలు మజ్నూ సినిమాకు సంబంధించినవి కాదు. ఆ ఫోటోలు వేరే షూట్‌ కు చెందినవి. నేను మజ్నూ సినిమా షూటింగ్‌ లో ఇంకా పాల్గొనలేదు. మార్చి 1వ వారంలో నా పార్టు షూటింగ్‌ మొదలవుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది అనుపమ. ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్యూ ఇస్తూ.. తాను స్టడీస్‌ కొనసాగించలేకపోతున్నానని.. అంటూ చెప్పుకొచ్చిన ఈ సుందరి.. ఆ సందర్భంలో ఆ ఫోటోల గురించి కామెంట్‌ చేసింది.

తెలుగులో నాగ చైతన్య సరసన మజ్నూ లో నటిస్తున్న అనుపమ.. నితిన్‌ అ..ఆ.. లతో పాటు రవితేజ కొత్త సినిమాలోనూ నటిస్తోంది.