గ్లామర్ గేట్ల లిఫ్టింగ్ మొదలెట్టిందా?

Tue May 22 2018 16:40:09 GMT+0530 (IST)

మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్.. తెలుగులో బోలెడన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. తన సొంత భాషలో మూవీస్ చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేయలేనంతగా.. టాలీవుడ్ లో బిజీ అయిపోయింది ఈ భామ. ఎప్పుడు చూసినా 3-4 తెలుగు సినిమాలు ఈమె చేతిలో ఉంటున్నాయంటే.. అనుపమ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.పెర్ఫామెన్స్ లో మెప్పించడంలో ఈమె బాగా దిట్ట. అయితే.. గ్లామర్ విషయంలో మాత్రం నిశ్చితాభిప్రాయాలను చెప్పుకొచ్చేది. బహుశా అందుకే కుర్రాళ్ల పక్కన తప్ప స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందడం లేదని అనుకోవచ్చు. ఇప్పటివరకూ ఎక్స్ పోజింగ్ విషయంలో ఈమె దూరం దూరం అనేది. కానీ రీసెంట్ గా రెడ్ మ్యాగజైన్ కోసం అనుపమా పరమేశ్వరన్ చేసిన ఫోటో షూట్లు చూస్తే ఎవరైనా సరే ఔరా అనాల్సిందే. మితి మీరడం.. శృతి మించడం లాంటివి ఏమీ కనిపించలేదు కానీ.. మొన్నటివరకు మడి కట్టుకుని కూర్చున్న అనుపమ ఇలా చేసిందా అనిపించక మానదు.

తన డ్రెస్ సైజును అనుపమ మెల్లగా తగ్గిస్తున్నట్లుగా అనిపించక మానదు. ఇంతకాలం పాటు బాగా పద్ధతిగా ఉండే పాత్రలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నిదానంగా గ్లామర్ గేట్లు తెరుస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అందాల ప్రదర్శన మరికాస్త ఎక్కువ చేయగలిగితే మాత్రం.. స్టార్ హీరోయిన్ అయ్యేందుకు షార్ట్ కట్ ఎంచుకున్నట్లే.