Begin typing your search above and press return to search.

అనుప‌మ సినిమాలో మెగా హీరో

By:  Tupaki Desk   |   21 Feb 2018 4:31 AM GMT
అనుప‌మ సినిమాలో మెగా హీరో
X
ఎప్పుడైనా సినిమా గురించి చెప్పాలంటే... మొద‌ట హీరో పేరు చెప్పి మొద‌లుపెడతాం. అంతెందుకు ద‌ర్శ‌కుడు హీరో ఎవ‌రో ముందుగా డిసైడ్ అయ్యాక క‌థ‌లో మార్పులు చేర్పులు చేస్తాడు. హీరోకు త‌గ్గ‌ట్టు హీరోయిన్‌ ను - ఇత‌ర పాత్ర‌ల‌ను ఎంపిక చేస్తాడు. ఇంత‌వ‌ర‌కు మెగా హీరో సాయి ధ‌ర‌మ్ విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింది. పాపం ఇప్పుడు మాత్రం జాత‌కం తిర‌గ‌బ‌డింది. అనుప‌మా మెయిన్ లీడ్‌ లో చేస్తున్న సినిమాలో తాను స‌ర్దుకుపోడానికి ఒప్పుకున్నాడు.

ఇక మెగా హీరో సాయి ధ‌ర‌మ్ ప‌రిస్థితి ఏం బాగోలేదు. వ‌రుస‌పెట్టి ప‌ల‌క‌రించిన ఫ్లాపులు ఆయ‌న కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఇంటెలిజెంట్ అట్ట‌ర్‌ ఫ్లాపు అవ్వ‌డంతో చాలా దిగాలు ప‌డ్డాడు. చేతిలో కూడా ఏం సినిమాలు లేక‌పోవ‌డంతో వ‌చ్చిన సినిమాల‌లో ఏదో ఒక‌టి ఒప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడ‌దే జ‌రిగింది. ఇప్పుడు సాయిధరమ్ తొలిప్రేమ డైరక్టర్ కరుణాకరన్‌ డైరక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుప‌మా మెయిన్ లీడ్‌ లో క‌రుణాక‌ర‌ణ్ ఆ కథను డిజైన్ చేశాడట. అందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌డానికి ఒప్పుకుని అంద‌రినీ ఆశ్చర్యపరుస్తాడు అంటున్నారు. సినిమా మొత్తం హీరోయిన్ వైపు నుంచే సాగుతుందట. అంటే ప్ర‌ధాన పాత్ర హీరోయినే అవుతుంది అనమాట.

ఫిదా సినిమాలో ఎలా అయితే... సాయి ప‌ల్ల‌వి వైపు నుంచే క‌థ చెప్పుకుంటూ వ‌చ్చాడో డైరెక్ట‌ర్‌.... ఈ సినిమాలో హీరోయిన్ వైపు నుంచే క‌థంతా సాగుతుందని టాక్. త‌న క‌న్నా అనుప‌మా పాత్ర నిడివే ఎక్కువ‌ని తెలిసి కూడా సాయి ధ‌ర‌మ్ ఒప్పుకున్నాడనే టాక్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రుస్తోంది. వ‌రుణ్ తేజ్ చేశాడుగా... నేను చేస్తా త‌ప్పా అనుకున్నాడో ఏమో మ‌రి.