Begin typing your search above and press return to search.

అనుపమ అయిదు కొట్టేనా?

By:  Tupaki Desk   |   22 Oct 2017 3:30 AM GMT
అనుపమ అయిదు కొట్టేనా?
X
మలయాళీ భామల అందాలకు టాలీవుడ్ బాగానే అలవాటై పడిపోయిందని చెప్పాలి. మొన్న ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. ఇక అంతకంటే ముందే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస విజయాలతో అనుపమ పరమేశ్వరన్ దూసుకుపోతోంది. ఏ మాత్రం తగ్గకుండా సౌత్ లో అన్ని భాషల్లో నటిస్తూ.. స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది.

అ..ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా అందరిని ఆకట్టుకుంది. ఇక అంతకుముందు నటించిన ప్రేమమ్ లో కూడా చేసింది చిన్న పాత్రే అయినా అందులోను అమ్మడి నటన ఆకట్టుకొంది. ఆ చిత్రాల విజయాల తర్వాత శతమానం భవతి సినిమాలో సోలో హీరోయిన్ గా మెప్పించి సోలో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ధనుష్ తో నటించిన ధర్మయోగి కూడా కోలీవుడ్ లో మంచి హిట్ అందుకుంది.

ఇక ఇయర్ కూడా అనుపమ చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. రామ్ - ఉన్నది ఒకటే జిందగీ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒక వేళ ఆ సినిమా హిట్ అయితే అనుపమ పాంచ్ పటాకా కొట్టినట్టే. ఈ రోజుల్లో హీరోయిన్స్ వరుసగా అయిదు విజయాలను అందుకోవడమంటే కష్టమే. మరి రామ్ అమ్మడికి ఆ ఆనందాన్ని ఇస్తాడో లేదో తెలియాలంటే ఈ నెల 27వరకు ఆగాల్సిందే.