అనుపమ వారియర్ ని చూస్తారా

Sat Feb 24 2018 17:09:49 GMT+0530 (IST)

ఏ ముహూర్తంలో దర్శకుడు ఒమర్ లుల్లుకి ప్రియా వారియర్ తో కన్ను గీటించాలి అనే ఐడియా వచ్చిందో కానీ ఒక్క వీడియో దెబ్బకి ఆన్ లైన్ స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఫీవర్ సెలెబ్రిటీలకు కూడా అంటుకుంటోంది. మొన్నే బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ చేసిన కామెంట్స్ మర్చిపోనేలేదు. ఇప్పుడు ఈ వరసలో హీరొయిన్లు కూడా జాయినవుతున్నారు. టాలీవుడ్ లో బాగానే అవకాశాలు కొట్టేస్తున్న కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అచ్చం ప్రియా వారియర్ తరహాలో ఒక కన్ను పూర్తిగా మూసేసి రెండో కన్నుతో కవ్విస్తూ రెండు చేతుల్లోని రెండు వేళ్ళను విజయానికి గుర్తులుగా చూపిన్తూ వెరైటీగా ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ కావాలని ఇలా చేసిందా లేక అనుకోకుండా అలాంటి ఫోటోనే తనకు తీసుకోవాలి అనిపించిందా అనుపమ బయట పెట్టలేదు.ఇప్పుడు ఈ ఫోటో చూసాక అనుపమ మీద కామెంట్స్ వర్షం కురుస్తోంది. కొందరు భలే ఉందే అంటుంటే మరికొందరు మాత్రం ప్రియా మేజిక్ చేయలేకపోయావ్ అంటూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు. అదలా ఉంచితే ప్రియా వారియర్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. లాస్ట్ ఇయర్ శతమానం భవతి ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లో మెరిసిన అనుపమ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి నాని కృష్ణార్జున యుద్ధం కాగా రెండోది సాయి ధరం తేజ్ తో చేస్తున్న కరుణాకరన్ మూవీ. ఇవి కాకుండా మరో రెండు అంగీకారం తెలపాల్సినవి లైన్ లో ఉన్నాయి.

గ్లామర్ షోకు దూరంగా ఒళ్లంతా పూర్తి బట్టలతో చుట్టేసుకుని ఒక వృత్తం గీసుకుని అందులోనే ఉంటున్న అనుపమ ఈ మాత్రం అవకాశాలు దక్కించుకోవడం గ్రేటే. ఇలా కన్ను కొట్టే కన్యలు ప్రత్యేకంగా కేరళలోనే ఉంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సాయి పల్లవి నివేదా థామస్ లాంటి కేరళ బ్యూటీస్ ఇప్పటికే హల్చల్ చేస్తున్నారు. త్వరలో ప్రియ వారియర్ కూడా సినిమాల్లో పలకరించినా ఆశ్చర్యం లేదు. అయినా మనది విశాల హృదయం. కేరళ కుట్టిలు రావాలే కాని వద్దన్న ట్రాక్ రికార్డ్ ఎన్నడూ లేదు.