Begin typing your search above and press return to search.

కంగనాను ఆకాశానికెత్తేసిన సీనియర్ బాలీవుడ్ యాక్టర్

By:  Tupaki Desk   |   10 Feb 2019 5:44 AM GMT
కంగనాను ఆకాశానికెత్తేసిన సీనియర్ బాలీవుడ్ యాక్టర్
X
'మణికర్ణిక' సినిమాను ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ వివాదాలు ఆ సినిమాను నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ సమయం నుండి మొదలైన వివాదాలు రిలీజ్ అయిన తర్వాత కూడా కొనసాగాయి. నిజానికి సినిమా ఎలా ఉంది.. నటీనటుల నటనాకౌశలం ఎలా ఉంది.. టెక్నిషియన్ల పనితనం ఎలా ఉంది అనే అంశాల కంటే కంగనా ఎవరితో గొడవ జరిగింది... ఎవరు సినిమానుంచి బైటకొచ్చారు? వాళ్ళేమన్నారు.. వారికి కంగనా ఆమె సోదరి రంగోలి ఏం సమాధానం ఇచ్చారు.. ఈ అంశాలే అందరి నోళ్ళలో నానాయి.

క్రిష్ ఏకంగా తన బంగారాన్ని కంగనా సిల్వర్ చేసిందని కూడా అన్నాడు. కంగనా ఏమీ తక్కువ తినలేదనుకోండి.. నాపై పడి ఏడిస్తే ఉపయోగం లేదని గట్టిగా సమాధానం ఇచ్చింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బాలీవుడ్ అంతా తనపై కత్తిగట్టిందని అంతా ఒక్కటై తనపై దాడి చేస్తున్నారని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అత్తెసరు సినిమాలు వస్తే ఆహా.. ఓహో అంటూ ఎగబడి మరీ ప్రశంసించే బాలీవుడ్ సెలబ్రిటీలు తన సినిమాల గురించి మౌనంగా ఉంటారని చురకలు అంటించింది. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిలో ఆమెక ఓ సీనియర్ నటుడి నుండి మద్దతు లభించింది.

సీనియర్ బాలీవుడ్ యాక్టర్.. అనుపమ్ ఖేర్ ఆమెపై రీసెంట్ గా ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ సంవాదంలో ఒక అభిమాని ఆయనను కంగనా గురించి.. 'మణికర్ణిక' గురించి అడగితే ఆయన "#కంగనా రనౌత్ ఒక రాక్ స్టార్. ఆమె బ్రిలియంట్. ఆమె ధైర్యాన్ని ఆమె నటనను నేను ప్రశంసిస్తున్నాను. #మహిళా సాధికారికతకు ఆమె ఒక నిజమైన ఉదాహరణ." అంటూ కంగనాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒక సీనియర్ బాలీవుడ్ నటుడి వద్దనుండి ఇలాంటి మద్దతు కంగనాకు మరింత బలాన్నిచ్చేదే.