పవన్ హీరోయిన్ కాలం కలిసొస్తోంది

Wed Jan 11 2017 17:54:04 GMT+0530 (IST)

మలయళీ కుట్టి అను ఇమాన్యుయేల్.. సౌత్ మొత్తం దున్నేసేందుకు సిద్ధమైపోయింది. మలయాళ సినిమాలు చేస్తూనే.. ఇటు తెలుగులో నాని సరసన మజ్నుతో మంచి హిట్ కొట్టింది కూడా. అంతే కాదు.. పెర్ఫామెన్స్ విషయంలో ట్యాలెంటెడ్ బ్యూటీ అనిపించేసుకుంది. ఇప్పుడీమె కెరీర్ పరుగులు పెట్టే రోజులు ప్రారంభమైపోయాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో అను ఇమ్మాన్యుయేల్ కి బెర్త్ కన్ఫాం అయిపోయింది. పవర్ స్టార్ తో హీరోయిన్ అనగానే క్రేజ్ అమాంతం పీక్స్ కి చేరిపోతుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ తెలుగులో గోపీచంద్ సరసన ఆక్సిజన్ మూవీలో కనిపించనుంది. మరోవైపు కోలీవుడ్ లో రీసెంట్ గా ప్రారంభమైన క్రేజీ ప్రాజెక్ట్ గౌతమ్ మీనన్- విక్రమ్ కాంబినేషన్ లో మొదలైంది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. అను ఇమ్మాన్యుయేల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది హీరోయిన్లనే పరిశీలించారు కానీ.. చివరకు ఈ ఆఫర్ వచ్చి మలయాళీ అమ్మడి ఒడిలో వాలిపోయింది. మజ్ను మూవీలో అను పెర్ఫామెన్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి.. ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/