ఫోటో స్టోరి: మజ్నూలకు మతిపోతోంది

Wed Aug 16 2017 17:06:50 GMT+0530 (IST)

మన దగ్గర మొదటి నుండి మలయాళం ముద్దుగుమ్మలు బాగానే ఇంప్రెస్ చేస్తుంటారు. అసిన్.. మీరా జాస్మిన్.. నయనతార.. నిత్యా మీనన్ తరువాత ఇప్పుడు కూడా కొత్త తరం భామలు కీర్తి సురేష్.. క్యాథరీన్ త్రెసా.. అనుపమ పరమేశ్వరన్.. కూడా చక్కగానే అలరిస్తున్నారు. అలాగే కొంతమంది గ్లామరసం దారబోసి టాలీవుడ్ అందలం ఎక్కడానికి కూడా రెడీ అయిపోతున్నారు. వారిలో అను ఎమ్మానుయేల్ మతిపోగొట్టేస్తోందనే చెప్పాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తూ.. అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాలో రొమాన్స్ చేస్తున్న ఈ మల్లూ హాటీ.. పూర్తిగా ఎన్నారై అనే చెప్పాలి. అమెరికాలో పెరిగి అక్కడే ఫిలిం మేకింగ్ కోర్సులు యాక్టింగ్ కోర్సులూ చేసి ఇండియా వచ్చింది. అమ్మడు ఇప్పుడు ఇలా రెడ్ మ్యాగజైన్ పై హాటు హాటుగా ఫోజిచ్చింది. ఇలా ఆమెను చూస్తుంనే మజ్నూలకు మతిపోవడం ఖాయం. ఆల్రెడీ నానితో ఈమె మజ్నూ సినిమా చేసినప్పుడే చాలామంది మతిపోగా.. ఆ మిగిలిన బ్యాచ్ అంతా ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. ఆ విధంగా అను మాయ చేస్తోంది.

ఇప్పటికిప్పుడు ఈమె ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేం కాని.. ఈ భామ కనుక పవన్ అండ్ బన్నీ సినిమాలో పెద్ద హిట్లు కొడితే మాత్రం ఖచ్చితంగా పెద్దహీరోయిన్ అయిపోవడం ఖాయం. అందంతో పాటు యాక్టింగ్.. గ్లామర్ తో పాటు టీజింగ్.. రెండూ చేస్తోంది కాబట్టి తిరుగే ఉండదు.